King Charles III coronation : లండన్‌లో అట్టహాసంగా కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం
King Charles III coronation : లండన్‌లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. 2300మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.
King Charles 3 coronation : బ్రిటన్‌లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం శనివారం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్వాసులు వీక్షిస్తుండగా రాజ కిరీటాన్ని ధరించారు కింగ్ ఛార్లెస్ 3. 7 దశాబ్దాల్లోనే అతిపెద్ద ఈవెంట్‌ను బ్రిటన్వాసులు ఆద్యంతం వీక్షించారు. 1000ఏళ్ల నాటి ఈ ఆచారాన్ని.. 21వ శతాబ్దపు బ్రిటన్ను ప్రతిబింబించే విధంగా ఈ వేడుకను తీర్చిదిద్దారు. తాజా వేడుకలతో లండన్ వీధులు కిక్కిరిసిపోయాయి.
2300 మంది అతిథుల మధ్య..
లండన్ వెస్ట్‌మినిస్టర్ అబేలో ఈ వేడుకలు జరిగాయి. విదేశీ నేతలు, ప్రముఖులు సహా దాదాపు 2,300 మంది అతిథులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. భారత దేశం తరపున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజ కుటుంబ నుంచి విడిపోయిన ప్రిన్స్ హ్యారీ సైతం ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. కాగా.. ఆయన భార్య, పిల్లలు వేడుకలకు దూరంగా ఉండిపోయారు.
King Charles 3 coronation live updates : గతేడాది సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో బ్రిటన్ తదుపరి రాజుగా చరిత్రలో నిలిచారు 74ఏళ్ల ఛార్లెస్. తాజాగా ఆయనకి పట్టాభిషేకం చేయడంతో.. ఛార్లెస్ రెండో భార్య, 75ఏళ్ల కమీలియా.. 'రాణిగా' మారారు.
ఈ వేడుకలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్.. బైబిల్ని చదివారు. హిందువు అయిన సునక్.. బైబిల్‌ను చదవడం భిన్న మత విశ్వాసాలను రాజకుటుంబం ప్రోత్సహిస్తుందనడానికి నిదర్శనం అని అధికారులు చెప్పారు. 'ఇది మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయానికి గర్వకారణం,' అని ఛార్లెస్ పట్టాభిషేకాన్ని అభివర్ణించారు రిషి సునక్.
King Charles 3 latest news : తాజా పట్టాభిషేకంతో.. బ్రిటన్‌తో పాటు 14 కామెన్వెల్త్ దేశాలకు రాజు అయ్యారు ఛార్లేస్ 3. మరోవైపు ఛార్లెస్ 3కి కిరీటం ధరిస్తుండగా.. బ్రిటన్వ్యాప్తంగా టపాసులు పేలాయి. గౌరవార్ధంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు.
మరోవైపు.. అనేకమంది రిపబ్లిక్ యాక్టివిస్ట్‌లు ఛార్లెస్ 3 పట్టాభిషేకానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ‘నాట్ మై కింగ్ (నా రాజు కాదు)..’ అంటూ నినాదాలు చేశారు. వీరిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం