Zika virus Karnataka : కర్ణాటకలో జికా కలకలం.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్
Zika virus Karnataka : కర్ణాటకలో జికా వైరస్ కేసు నమోదైంది. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్ అని తేలింది.
Zika virus Karnataka : దేశంలో జికా వైరస్‌పై మళ్లీ ఆందోళనలు పెరిగాయి. పుణెకు చెందిన ఓ వ్యక్తికి జికా వైరస్ పాజిటివ్ అని తేలిన కొద్ది రోజులకే.. కర్ణాటకలో మరో కేసు నమోదైంది. ఓ ఐదేళ్ల చిన్నారికి సైతం ఈ వ్యాధి సోకింది.
ఐదేళ్ల చిన్నారి రక్తనమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. చిన్నారికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.
Zika virus India : అయితే.. పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
"రాష్ట్రంలో ఇదే మొదటి కేసు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. జికాను ఎదుర్కొనేందుకు మేము సన్నద్ధమయ్యే ఉన్నాము," అని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డా. కే సుధాకర్ మీడియాకు తెలిపారు.
పుణెలో.. 67ఏళ్ల వృద్ధుడికి..
Maharashtra Zika virus cases : డిసెంబర్ తొలి వారంలో.. పుణె బావ్ధాన్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ 67ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకినట్టు తేలింది. నాసిక్‌లో నివాసముండే ఆ వ్యక్తి.. నవంబర్ 6న పుణెకు వెళ్లాడు. జ్వరం, జలుబు, దగ్గు, శరీరం నొప్పుల కారణంగా నవంబర్ 16న జహగీర్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. జికా వైరస్ పాజిటివ్ అని తేలింది.
జికా వైరస్ లక్షణాలు.. చికిత్స..
1947లో ఉగాండలోని అడవుల్లో తొలిసారిగా ఈ జికా వైరస్‌ను గుర్తించారు. అప్పటి నుంచి ఆఫ్రికా, నైరుతి ఆసియా, పెసిఫిక్ ద్వీపాల్లో జికా వైరస్ కలకలం సృష్టించింది. 2016లో బ్రెజిల్లో జికా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. కొన్ని నెలల క్రితం.. కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో సైతం జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.
Zika virus symptoms : ఏడెస్ జాతి దోమల కారణంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇవి మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుంది.
దద్దుర్లు, జ్వరం, కంజెక్టివైటిస్, జాయింట్ నొప్పులు, తలనొప్పులు వంటి సమస్యలు.. జికా వైరస్ లక్షణాలుగా ఉన్నాయి. ఇవి 2-7 రోజుల వరకు ఉంటాయి.
Zika virus treatment : జికా వైరస్ కోసం ప్రత్యేకంగా.. చికిత్సేమీ అవసరం లేదు. జికా వైరస్ సోకిన రోగులకు ఎక్కువగా విశ్రాంతి కావాలి. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. పారాసిటమాల్‌తో జ్వరాన్ని నియంత్రించాలి. అప్పటికీ లక్షణాలు ఎక్కువగా ఉంటే.. అప్పుడు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. జికాకు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
సంబంధిత కథనం