zika virus | మహారాష్ట్రలో `జికా` కలకలం
zika virus | ఇప్పటికే వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేశ వాసులపై.. ఇప్పుడు సీజనల్ వ్యాధులకు తోడు ప్రాణాంతక జికా వైరస్‌లు పంజా విసురుతున్నాయి.
zika virus | మహారాష్ట్రలో ఇటీవల ఒక ఏడు సంవత్సరాల పాప జికా వైరస్ బారిన పడింది. ఈ వివరాలను మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో ఏడేళ్ల పాపకు జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నివారణతో పాటు చికిత్సపై కూడా దృష్టి పెట్టామన్నారు.
zika virus | జికా వైరస్
ఇది దోమ కాటుతో వస్తుంది. ముఖ్యంగా పగటి పూట తిరిగే దోమల వల్ల ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ కాలంలో వర్షపు నీరు నిలవ ఉండడం సహజం. ఆ నిలువ నీటి వల్ల దోమల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలను నివారించడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోనే గత సంవత్సరం జులై లో కూడా జికా వైరస్ వెలుగు చూసింది.
zika virus | లక్షణాలు
ఈడిస్ జాతి దోమకాటు వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది. జికా వైరస్ సోకినవారికి తీవ్రమైన తలనొప్పి, జ్వరం ఉంటాయి. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కళ్లు ఎర్రగా అవుతాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులు, ఒళ్లునొప్పులు ఉంటాయి. చాలావరకు ప్రాణాంతకం కాదు. అయితే, గర్భిణులు ఈ వైరస్ బారిన పడితే పుట్టబోయే పిల్లలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు పుట్టుకతో వచ్చే పలు సమస్యల బారిన పడుతారు. ఈ వైరస్ సోకినట్లు అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీరు ఎక్కువగా తాగాలి. విశ్రాంతి బాగా తీసుకోవాలి. జ్వరం, ఒళ్లునొప్పులకు మందులు వాడాలి.