Joe Biden: 2024 ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-joe biden officially announces he is running for re election as us president in 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Joe Biden: 2024 ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Joe Biden: 2024 ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2023 06:38 PM IST

Joe Biden - US President Election: తదుపరి ప్రెసిడెంట్ ఎలక్షన్‍లో పోటీ చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టతనిచ్చారు. తాను బరిలో ఉంటానని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు.

Joe Biden: 2024 ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
Joe Biden: 2024 ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (AFP)

Joe Biden - US President Election: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అధికారిక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం తలపడతానని వెల్లడించారు. 80ఏళ్ల బైడెన్ అమెరికా చరిత్రలో ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‍గా ఉన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‍పైనే డెమొక్రట్ లీడర్ జో బైడెన్ పోటీ పడాల్సి రావొచ్చు.

అందుకే మళ్లీ పోటీ..

Joe Biden: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ గురించి స్పష్టతనిచ్చేందుకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. ఇది మూడు నిమిషాల నిడివితో ఉంది. “ప్రజాస్వామ్యం కోసం నిలబడాల్సిన సందర్భాలు ప్రతీ తరానికి వస్తాయి. ప్రాథమిక స్వేచ్ఛ కోసం నిలబడాల్సి ఉంటుంది. ఇది మాకు సందర్భం అని నేను నమ్ముతున్నా. అందుకే యూఎస్ఏ (అమెరికా) అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు మళ్లీ ఎలక్షన్‍లో పోటీ చేస్తాను” అని జో బైడెన్ ఆ వీడియోలో పేర్కొన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఆ తర్వాత 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన చిత్రాలతో బైడెన్ ఇప్పుడు విడుదల చేసిన వీడియో మొదలైంది.

Joe Biden: “అమెరికన్లుగా మనందరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమికమైన హక్కు. అంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మన ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కులను రక్షించేందుకు నా మొదటి (ప్రస్తుతం) హయాంలో కృషి చేస్తున్నా. దేశంలో ప్రతీ ఒక్కరినీ సమానంగా చూసేలా, అందరికీ సమాన హక్కులు దక్కేలా చేస్తున్నా” అని బైడెన్ ఆ వీడియోలో అన్నారు.

ట్రంప్‍పై పరోక్ష విమర్శలు

Joe Biden “అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుదాం” (Making America Great Again - MAGA) అనే అతివాదులు అంటూ డొనాల్డ్ ట్రంప్‍ను పరోక్షంగా టార్గెట్ చేశారు బైడెన్. దేశంలో స్వేచ్ఛను పునాది నుంచి పెకలించే వేసేందుకు వారు ఉబలాటపడుతున్నారని విమర్శించారు.

“అమెరికా ఆత్మ కోసం పోరాటంలో మనం ఉన్నామని 4 సంవత్సరాల క్రితం ఎన్నికల బరిలో ఉన్నప్పుడు నేను చెప్పా. మనం ఇంకా ఆ పోరాటంలో ఉన్నాం. ఆత్మ సంతృప్తి చెందేందుకు ఇది సమయం కాదు. అందుకే నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఈ బాధ్యతను పూర్తి కానివ్వండి. మనం చేయగమని నాకు తెలుసు” అని జో బైడెన్ అన్నారు.

మరోవైపు, వయసు కారణంగా జో బైడెన్ పోటీపై డెమొక్రటిక్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్లు.. ఎన్నికల ప్రచారంలో బైడెన్ వయసును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే అవకాశం ఉంటుందని డెమొక్రటిక్ పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.

IPL_Entry_Point