Jeff Bezos : కాబోయే భార్యకు 5 బిలియన్ విలువ చేసే ‘గిఫ్ట్’ ఇచ్చిన అమెజాన్ బాస్!
Jeff Bezos new house : కాబోయే భార్యకు గిఫ్ట్ ఇచ్చేందుకు.. భారీగానే ఖర్చు పెట్టారు జెఫ్ బెజోజ్! 5 బిలియన్ విలువ చేసే మాన్షన్‌ను కొన్నారు.
Jeff Bezos new house : అమెజాన్ బాస్ జెఫ్ బెజోజ్ మరోమారు వార్తల్లో నిలిచారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటీవలే ఆయన ఓ మాన్షన్ కొన్నారు. దీని ధర 68 మిలియన్ డాలర్లని సమాచారం. ఇండియన్ కరెన్సీలో అయితే అది రూ. 5,64,10,52,200. కాబోయే భార్యకు ఈ ఇల్లును గిఫ్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఐల్యాండ్‌లో ఇల్లు..
ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోజ్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన నెట్ వర్త్ 165బిలియన్ డాలర్లు. కాగా.. లారెన్ శాంచెజ్ అనే మహిళను ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. గత నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో 2.5 మిలియన్ డాలర్లు విలువ చేసే రింగ్‌ను శాంచెజ్ వేలికి తొడిగారు బెజోజ్. ఇక ఇప్పుడు ఆయన ఫ్లోరిడాలోని "బిలియనీర్ బంకర్" ఎంక్లేవ్‌లో ఓ మాన్షన్‌ను కొన్నారు. అది శాంచెజ్ సొంతమని తెలుస్తోంది.
Jeff Bezos net worth : ఫ్లోరిడాలో ఒక మ్యాన్ మేడ్ ఐల్యాండ్ ఉంది. దీనికి సొంతంగా మున్సిపాలిటీ, మేయర్, పోలీస్ ఫోర్స్ వంటివి ఉన్నాయి. బెజోజ్ కొన్న కొత్త ఇల్లు.. వీటి మధ్యలోనే ఉంది. టామ్ బ్రాడీ, ఇవాంక ట్రంప్, జారెడ్ కుష్నెర్ వంటి ప్రముఖుల నివాసలు కూడా ఇక్కడే ఉన్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం ఈ ఐల్యాండ్‌లో కేవలం 81మంది మాత్రమే నివాసముంటున్నారు.
ఈ 9,259 స్క్వేర్ ఫీట్ మాన్షన్‌ను 2.8 ఎకరాల భూమిలో నిర్మించారు. ఎంటీఎం స్టార్ ఇంటర్నేషనల్ కార్ప్ మాజీ మేనేజర్ టులియా సౌసి డే గొర్రండానా నుంచి జెఫ్ బెజోజ్ ఈ ఇంటిని కొన్నారు. 1982లో ఇది 1.4మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే దీని విలువ 4.4 మిలియన్ డాలర్లుగా ఉంటుంది.
అమెజాన్ బాస్ జెఫ్ బెజోజ్ ఇంతటితో ఆగేలా లేరని తెలుస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం.. ఈ మ్యాన్ మేడ్ ఐలాండ్‌లో బెజోజ్ మరిన్ని ఇళ్లను కొనాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి చూసినట్టు, దాని విలువ, తాజాగా కొన్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం.
Jeff Bezos Lauren Sanchez : ఇక ఫ్లోరిడా మాన్షన్ రాకతో జెఫ్ బెజోజ్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో మరింత పెరిగింది. 2020లో బేవెర్లి హిల్స్‌లో 165 మిలియన్ డాలర్లు విలువ చేసే ఇంటిని కొన్నారు. ఇది వాషింగ్టన్లోనే అతిపెద్దది! ఇక హవాయిలో 78మిలియన్ డాలర్లు పెట్టి మరో భవనం కొనుగోలు చేశారు. ఈ 59ఏళ్ల వ్యాపారవేత్తకు మెదినా అనే ప్రాంతంలో 5.3 ఎకరాల ఎస్టేట్ ఉంది. టెక్సాస్‌లో 30ఎకరాల రాంచ్ కూడా ఉంది. ఇవే కాకుండా బెజోజ్ రియల్ ఎస్టేట్ ఆస్తుల లిస్ట్ చాలా పెద్దది.
సంబంధిత కథనం