JEE Main 2023 Session 2 Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్సర్ కీ వచ్చేసింది: డౌన్‍లోడ్ ఇలా!-jee main 2023 session 2 answer key released how to download ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main 2023 Session 2 Answer Key Released How To Download

JEE Main 2023 Session 2 Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్సర్ కీ వచ్చేసింది: డౌన్‍లోడ్ ఇలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 20, 2023 06:36 AM IST

JEE Main 2023 Session 2 Answer Key: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ ఆన్సర్ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను తెలిపే అవకాశం కూడా ఉంది.

JEE Main 2023 Session 2 Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్సర్ కీ వచ్చేసింది
JEE Main 2023 Session 2 Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్సర్ కీ వచ్చేసింది

JEE Main 2023 Session 2 Answer Key: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2023 సెషన్ 2 (JEE Main 2023 Session 2) ఆన్సర్ కీ వెల్లడైంది. ఈ జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్‍కు సంబంధించిన ‘ప్రొవిజనల్ ఆన్సర్ కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 మధ్య జరిగిన జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 బీ.టెక్/బీఈ, బీఆర్క్/బీ.ప్లానింగ్ పరీక్షకు హాజరైన వారు ఈ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in వెబ్‍సైట్‍ ద్వారా ప్రొవిజనల్ ఆన్సర్ కీ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

JEE Main 2023 Session 2 Answer Key: ప్రొవిజనల్ ఆన్సర్ కీని అభ్యర్థులు ఛాలెంజ్ చేయవచ్చని ఎన్‍టీఏ పేర్కొంది. అభ్యంతరాలను తెలిపేందుకు ఏప్రిల్ 21 ఆఖరు తేదీగా నిర్ణయించింది. ఒక్కో ప్రశ్న ఛాలెంజ్ చేసేందుకు అభ్యర్థి రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

JEE Main 2023 Session 2 Answer Key: అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాక.. ఫైనల్ ఆన్సర్ కీని ఎన్‍టీఏ విడుదల చేస్తుంది. ఫలితాల వెల్లడి సమయంలోనూ ఈ ఫైనల్ ఆన్సర్ కీ కూడా వస్తుంది. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లోనే.. అభ్యర్థుల ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఉంటాయి. ఫైనల్ ఆన్సర్ కీని చాలెంజ్ చేసే అవకాశం ఉండదు.

JEE Main 2023 Session 2 Answer Key: ఆన్సర్ కీ డౌన్‍లోడ్ ఇలా..

  • ముందుగా ఎన్‍టీఏ అధికారిక వెబ్‍సైట్ jeemain.nta.nic.in లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలోనే జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ప్రొవిజనల్ ఆన్సర్ కీ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అనంతరం అప్లికేషన్ నంబర్, పాస్‍వర్డ్/డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో లాగిన్ అవండి.
  • ఆ తర్వాత జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఆన్సర్ కీ స్క్రీన్‍పై కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీని డౌన్‍లోడ్ చేసుకొని, నిశితంగా పరిశీలించండి.

ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షలు జరుగుతాయి. ఎన్‍టీఐ ఈ పరీక్షలను జరుపుతుంది. ఆల్ఇండియా ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది.

IPL_Entry_Point

టాపిక్