Cartwheel Galaxy : స్పేస్‎‎లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న గెలాక్సీ ఫొటోలు తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్-james webb space telescope captured cartwheel galaxy image ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cartwheel Galaxy : స్పేస్‎‎లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న గెలాక్సీ ఫొటోలు తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

Cartwheel Galaxy : స్పేస్‎‎లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న గెలాక్సీ ఫొటోలు తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

Anand Sai HT Telugu
Aug 04, 2022 01:41 PM IST

నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా అద్భుతం చేసింది. కార్ట్ వీల్ గెలాక్సీ ఫొటోలు తీసింది. అయితే ఇందుకోసం గందరగోళంలోకి ప్రవేశించింది.

<p>కార్ట్ వీల్ గెలాక్సీ Image Source : NASA</p>
కార్ట్ వీల్ గెలాక్సీ Image Source : NASA

NASA జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కార్ట్‌వీల్ గెలాక్సీ ఫొటోలు తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కార్ట్‌వీల్ గెలాక్సీ గందరగోళంలోకి ప్రవేశించింది వెబ్ టెలిస్కోప్. ఇక్కడ గందరగోళం అని ఎందుకంటున్నామంటే.. కార్ట్ వీల్ గెలాక్సీ సరిగా ఉంటే కదా. ఎలా పడితే అలా తిరుగుతుంది. దానిని ఫొటో తీయడమంటే.. ఎంత కష్టపడాలో తెలుసా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంత కష్టపడింది. గిరిగిర భూ చక్రంలా తిరుగుతుంది. ఈ గెలాక్సీ వెంటపడిందన్నమాట. గెలాక్సీ కార్ట్ వీల్.. నక్షత్రాల నిర్మాణం, సెంట్రల్ బ్లాక్ హోల్ గురించి కొత్త వివరాలను వెల్లడించింది.

కార్ట్‌వీల్ గెలాక్సీ.. 500 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో స్కల్ప్టర్ కాన్స్టెలేషన్‌లో ఉంది. దీనిని ఫొటోలు తీయడం అంటే మమూలు విషయం కాదు. స్పైరల్ గెలాక్సీకి మరో చిన్న గెలాక్సీ మధ్య అత్యంత వేగవంతమైన తాకిడి జరిగింది. అప్పుడు కార్ట్ వీల్ గెలాక్సీ ఏర్పడింది.

ఈ తాకిడితో గెలాక్సీ ఆకారం, నిర్మాణం ప్రభావితమయ్యాయి. కార్ట్‌వీల్ గెలాక్సీ రెండు రింగ్‌లను కలిగి ఉంది. ప్రకాశవంతమైన లోపలి రింగ్ ఒకటి కాగా.., చుట్టుపక్కల రంగురంగుల రింగ్ మరొకటి. రెండు గెలాక్సీలు ఢీ కొట్టడంతో.. ఇంత పెద్ద చక్రంలా కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉండటంతో.. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని 'రింగ్ గెలాక్సీ' అని కూడా పిలుస్తారు. ఇది మన పాలపుంత వంటి స్పైరల్ గెలాక్సీల మాదిరే ఉంటుంది.

హబుల్ స్పేస్ టెలిస్కోప్‌తో సహా ఇతర టెలిస్కోప్‌లు గతంలో కార్ట్‌వీల్‌ ఫొటోలు తీశాయి. కానీ ఏం లాభం.. దుమ్ము, ధూళీ కారణంగా అస్పష్టంగా ఉండేవి. తాజాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. ఇన్‌ఫ్రారెడ్ కిరణాలతో ఫొటోలు తీసింది. దీంతో చక్కగా కనిపిస్తున్నాయి. అయితే చూడడానికి ఫొటోలు.. చిన్నగానే కనిపించినా.. గెలాక్సీ 440 మిలియన్ సంవత్సరాలు విస్తరించి ఉంది. లోపల కనిపించే.. రింగ్ నుంచి వస్తున్న విపరీతమైన రేడియంట్ ఎనర్జీతో ఔటర్ రింగ్ విస్తరిస్తూ ఉంది. ఇక్కడే ఔటర్ రింగ్ సమీపంలో చాలా నక్షత్రాలు, సూపర్ నోవాలు ఉద్భవిస్తున్నాయి.

కార్ట్‌వీల్ తాత్కాలిక దశలో ఉందని వెబ్ పరిశీలనలు చెబుతున్నాయి. గెలాక్సీ దాని ఢీకొనడాని కంటే ముందు స్పైరల్ గెలాక్సీ, రూపాంతరం చెందుతూనే ఉంటుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన.. కార్ట్‌వీల్ ప్రస్తుత స్థితి ఫొటోలు.. గతంలో ఈ గెలాక్సీకి ఏం జరిగింది? భవిష్యత్తులో ఇది ఎలా అభివృద్ధి చెందుతుంది? అనే దాని గురించి తెలిసే అవకాశం ఉంది.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ప్రపంచంలోని ప్రధాన అంతరిక్ష విజ్ఞాన అబ్జర్వేటరీ. మన సౌర వ్యవస్థలోని రహస్యాలను పరిష్కరిస్తుంది. ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న సుదూర ప్రపంచాలను దాటి చూస్తుంది. మన విశ్వంలోని రహస్యమైన నిర్మాణాలు, మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ESA (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి NASA నేతృత్వంలో అంతర్జాతీయ కార్యక్రమం కింద.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనిచేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్