IOCL recruitment 2023 : ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా-iocl recruitment for 106 executive posts know how to apply ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iocl Recruitment 2023 : ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా

IOCL recruitment 2023 : ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా

Sharath Chitturi HT Telugu
Feb 28, 2023 05:12 PM IST

IOCL recruitment 2023 : ఐఓసీఎల్​లో 106 ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు సంబంధించిన రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొదలైంది. మార్చ్​ 22 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా
ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా

IOCL recruitment 2023 : ఐఓసీఎల్​ (ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​)లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్​ పడింది. కాంట్రాక్ట్​ బేసిస్​ కింద 106 ఎగ్జిక్యూటివ్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్​ను సమర్పించేందుకు తుది గడువు మార్చ్​ 22. ఆసక్తిగల అభ్యర్థులు.. iocl.com లో ఆన్​లైన్​ ద్వారా అప్లికేషన్​ను సమర్పించవచ్చు.

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​- వేకెన్సీ వివరాలు..

ఈసారి మొత్తం 106 ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్​ పడింది. వీటిల్లో లెవల్​ 1 ఎగ్జిక్యూటివ్​ పోస్టులు 96 ఉన్నాయి. మిగిలిన 10.. లెవల్​ 2 ఎగ్జిక్యూటివ్​ పోస్ట్​లు ఉన్నాయి.

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్ వయస్సు పరిమితి- లెవల్​ 1 ఎగ్జిక్యూటివ్​ పోస్టుకు అప్లై చేస్తున్న వారి వయస్సు 35ఏళ్లు మించకూడదు. లెవల్​ 2 ఎగ్జిక్యూటివ్​ పోస్టుకు అప్లై చేస్తున్న వారి వయస్సు 45 కన్నా ఎక్కువ ఉండకూడదు.

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్- ఇలా అప్లై చేసుకోండి

IOCL recruitment for executive posts : స్టెప్​ 1:- www.iocl.com వెబ్​సైట్​లోకి వెళ్లాలి.

స్టెప్​ 2:- కెరీర్​ ట్యాబ్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫామ్​ను ఫిల్​ చేయాలి.

స్టెప్​ 4:- సంబంధిత డాక్యుమెంట్​లను అప్లోడ్​ చేయాలి.

స్టెప్​ 5:- అప్లికేషన్​ ఫీజ్​ చెల్లించాలి.

స్టెప్​ 6:- అప్లికేషన్​ను సబ్మీట్​ చేసి, సంబంధిత కాపీని ప్రింటౌంట్​ తీసుకోవాలి.

IOCL recruitment 2023 apply online : అభ్యర్థులు.. అప్లికేషన్​ ఫామ్​ను ప్రింటౌట్​ తీసుకుని, ఇటీవలే తీసుకున్న పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటోను జత చేసి, సంబంధిత పత్రాలను జతచేయాలి. సంతకం చేయాల్సిన చోట సిగ్నేచర్​ పెట్టి.. The Advertiser, Lodhi Road, New Delhi 110003. Post Box No. 3096, Head Post Office కు పోస్ట్​ చేయాలి. 2024 ఏప్రిల్​ 4లోగా అది సంబంధిత అడ్రస్​కు చేరుకునే విధంగా చూసుకోవాలి.

గెయిల్​లో ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టులు..

GAIL Recruitment 2023 : ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల అప్లికేషన్లకు ఆహ్వానించింది గెయిల్​ ఇండియా లిమిటెడ్​. అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టు అప్లికేషన్​కు తుది గడువు మార్చ్​ 15. అభ్యర్థులు గెయిల్​ అధికారిక వెబ్​సైట్​ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్​ ట్రైనీకి సంబంధించి 47 ఖాళీలకు ప్రస్తుతం రిక్రూట్​మెంట్​ జరుగుతోంది. వీటిల్లో 20 పోస్టులు.. ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (కెమికల్​), 11 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (సివిల్​), 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (గెయిల్​టెల్​ టీసీ/టీఎం), మరో 8 పోస్టులు ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ (బీఐఎస్​)కు చెందినవి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner