చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్, థాయిలాండ్ తదితర దేశాల్లో మళ్లీ కరోనా(corona) కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో, భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు కొవిడ్(covid) ప్రోటోకాల్ ను పాటించాలని, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను వేసుకోవాలని సూచించింది. టెస్ట్ ల సంఖ్యను పెంచాలని, పాజిటివ్ సాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ ను పంపించాలని రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో కోవిడ్ (covid)ను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రధాని మోదీ సైతం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
కరోనా(corona) తాజా వేవ్ తో భారతీయులకు ముప్పు ఉండబోదని ఎయిమ్స్(AIIMS) మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా(Dr Randeep Guleria) తెలిపారు.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7(Omicron BF.7) ను ఎదుర్కొనేందుకు తగినంత ఇమ్యూనిటీ భారతీయుల్లో మెజారిటీ ప్రజలకు ఇప్పటికే ఉందన్నారు. భారతీయుల్లోని హైబ్రిడ్ ఇమ్యూనిటీ(hybrid immunity) బీఎఫ్ 7(Omicron BF.7)ను సమర్ధవంతంగా ఎదుర్కోగలదన్నారు. భారతీయుల్లో మెజారిటీ ప్రజలకు ఇప్పటికే కరోనా(corona) సోకి తగ్గి ఉండడం వల్ల సహజంగా లభించే ఇమ్యూనిటీకి తోడు, మెజారిటీ ప్రజలు కోవిడ్ టీకా తీసుకుని ఉండడం వల్ల వచ్చిన కృత్రిమ ఇమ్యూనిటీ వల్ల భారతీయుల్లో మెజారిటీ ప్రజలకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ(hybrid immunity) వచ్చిందని వివరించారు. అందువల్ల భారతీయుల్లో హాస్పిటల్ లో చేరాల్సిన స్థాయిలో కోవిడ్(covid) తీవ్రత ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
గత అనుభవాలను పరిశీలిస్తే.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అర్థమవుతుందని డాక్టర్ గులేరియా వ్యాఖ్యానించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ ల నుంచి వస్తున్న ప్రయాణీకులకు కచ్చితంగా ఆర్టీపీసీఆర్(RT-PCR test mandatory) పరీక్ష నిర్వహించాలని శనివారం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ బీఎఫ్ 7(Omicron BF.7) వేరియంట్ భారత్ లో ప్రవేశించి ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిన విషయాన్ని డాక్టర్ గులేరియా గుర్తు చేశారు. భారత్ లో ఇప్పటికే సుమారు 250 ఒమిక్రాన్ వేరియంట్లను గుర్తించారని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ తెలిపారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా ట్రావెల్ బ్యాన్ పెట్టడం వల్ల ఉపయోగం లేదని, బదులుగా, ప్రయాణీకులు పెద్దగా ఇబ్బంది కలగకుండా ర్యాండమ్ టెస్టింగ్ మేలు అని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్ల ను ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూ ఉండడం అవసరమన్నారు.
టాపిక్