Indian student death : లండన్​లో భారత విద్యార్థిని మృతి- సైక్లింగ్​ చేస్తుండగా..-indian phd student run over by truck in london dies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Student Death : లండన్​లో భారత విద్యార్థిని మృతి- సైక్లింగ్​ చేస్తుండగా..

Indian student death : లండన్​లో భారత విద్యార్థిని మృతి- సైక్లింగ్​ చేస్తుండగా..

Sharath Chitturi HT Telugu
Mar 25, 2024 11:39 AM IST

Indian student dies in London : లండన్​లో చదువుకుంటున్న ఓ భారతీయ మహిళపై నుంచి ఓ ట్రక్​ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె మరణించారు.

లండన్​లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మహిళ చైస్తా కొచ్చర్​..
లండన్​లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మహిళ చైస్తా కొచ్చర్​..

Cheistha Kochar death reason : సైక్లింగ్​ చేస్తుండగా, ట్రక్​ ఢీకొట్టడంతో.. లండన్​లో చదువుకుంటున్న ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె పేరు చైస్తా కొచ్చర్​. ట్రక్​ ఢీకొట్టిన సమయంలో ఆమె సైక్లింగ్​ చేస్తున్నట్టు సమాచారం. ట్రక్​ ఆమెపై నుంచి వెళ్లిందని తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

సెల్యులర్​ ఆపరేటర్స్​ అసోసియేన్​ ఆఫ్​ ఇండియా (సీఓఏఐ) జనరల్​ డైరక్టర్​, రిటైర్డ్​ లుటినెంట్​ జనరల్​ డా. ఎస్​పీ కొచ్చర్​ కూతురు చైస్తా కొచ్చర్​. 33ఏళ్ల చైస్తా కొచ్చర్​.. లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​లో పీహెచ్​డీ చదువుకుంటున్నారు.

కాగా.. మార్చ్​ 19, చైస్తా కొచ్చర్​.. తన భర్తతో కలిసి, ఇంటికి సమీపంలో సైక్లింగ్​ చేస్తోంది. అదే సమయంలో.. ఓ గార్బేజ్​ ట్రక్​, ఆమెను ఢీకొట్టింది. అది చూసిన ఆమె భర్త.. చైస్తా కొచ్చర్​ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చివరికి.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు.

ఈ విషయాన్ని.. నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​.. ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Cheistha Kochar Linkedin : "నీతీ ఆయోగ్​ నిర్వహించిన #LIFE ప్రోగ్రామ్​లో చైస్తా కొచ్చర్​.. నాతో కలిసి పనిచేశారు. #NUDGE యూనిట్​లో ఉన్న ఆమె.. బిహేవియరల్​ సైన్స్​లో పీహెచ్​డీ చేసేందుకు లండన్​కి వెళ్లారు. కానీ సైక్లింగ్​ చేస్తుండగా.. ట్రాఫిక్​ యాక్సిడెంట్​లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె చాలా తెలివైన మనిషి. చాలా తొందరగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్​ఐపీ," అని ఎక్స్​లో ట్వీట్​ చేశారు అమితాబ్​ కాంత్​.

చైస్తా కొచ్చర్​ మరణంపై ఆమె తండ్రి రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్​ డా. ఎస్​పీ కొచ్చర్​ కూడా స్పందించారు.

"నేను ఇంకా లండన్​లోనే ఉన్నాను. నా బిడ్డ చైస్తా కొచ్చర్​ మృతదేహాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మార్చ్​ 19న సైక్లింగ్​ చేస్తుండగా.. ట్రక్​ ఆమె మీద నుంచి వెళ్లింది. ఆమె మరణంతో మా మనసులు విరిగిపోయాయి," అని లింక్డిన్​లో పోస్ట్​ చేశారు రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్​ డా. ఎస్​పీ కొచ్చర్​.

Indian student dies in London : 2023 సెప్టెంబర్​లో లండన్​కు వెళ్లారు చైస్తా కొచ్చర్​. దాని కన్నా ముందు.. ఆమె హరియాణలోని గురుగ్రామ్​లో నివాసముండేవారు. లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​లో అడ్మిషన్​కి ముందు.. ఆమె దిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్​ పెన్సిల్వేనియా, చికాగోల్లో చదువుకున్నారు.

సంబంధిత కథనం