Air quality: వాయు నాణ్యతలో ఎక్కడో అట్టడుగున భారత్-india 8th in worst air quality lahore most polluted city in subcontinent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air Quality: వాయు నాణ్యతలో ఎక్కడో అట్టడుగున భారత్

Air quality: వాయు నాణ్యతలో ఎక్కడో అట్టడుగున భారత్

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 04:21 PM IST

ప్రపంచవ్యాప్తంగా వాయు నాణ్యతలో భారత్ చివరి నుంచి 8వ స్థానంలో ఉంది. 131 దేశాల్లో 118 దేశాలు అంటే 90 శాతానికి పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయు నాణ్యత ప్రమాణాల కన్నా చాలా దిగువన ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

వాయు కాలుష్య సూచి 2022 (air pollution index 2022) లో భారత్ స్థానం ఏమంత మెరుగుపడలేదు. గత సంవత్సరం ఈ ఇండెక్స్ చివరి నుంచి 5 వ స్థానంలో ఉన్న భారత్ 2022 సూచీలో 8వ స్థానానికి మెరుగు పడింది. ఐఒఎయిర్ (IQAir) అనే స్విట్జర్లాండ్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ (world air quality report) ఇండెక్స్ ను రూపొందించింది.

వాయు కాలుష్యంలో టాప్ లాహోర్

2022లో చాడ్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రైన్, బంగ్లాదేశ్ లు వాయు కాలుష్యంలో టాప్ 5 గా, అత్యంత కాలుష్యభరిత దేశాలుగా నిలిచాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం వాయు కాలుష్యం 2.5 పీఎం (PM2.5) లెవెల్ 5 µg/m3 కన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ భారత్ లో ఇది 2022లో 53.3 μg/m3 గా ఉంది. అంటే సురక్షిత పరిమితి కన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ. 2021లో ఇది 58.1 µg/m3 గా ఉంది. రాజస్తాన్ లోని భివండి భారత్ లోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా ఉంది. భివండిలో వాయు కాలుష్యం 92.7 μg/m3 గా ఉంది. అలాగే, భారత్ లోని 60% నగరాల్లో వాయు కాలుష్యం డబ్ల్యూహెచ్ ఓ (WHO) ప్రమాణాల కన్నా అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్ లోని లాహోర్ అత్యంత కాలుష్య భరిత నగరంగా నిలిచింది. ఇక్కడ వాయు కాలుష్యం 97.4 μg/m3 గా ఉంది.

ఇవి బెస్ట్..

డబ్ల్యూహెచ్ ఓ (WHO) ప్రమాణాల మేరకు వాయు నాణ్యత ఉన్న దేశాలు ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రెనడా, ఐజ్లాండ్, న్యూజీలాండ్ మాత్రమే. ఇవి మినహాయిస్తే మిగతా దేశాలన్నీ డబ్ల్యూహెచ్ ఓ (WHO) ప్రమాణాలను మించి వాయు కాలుష్యం కలిగి ఉన్నాయి.

టాప్ 8 మనవే..

ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్యభరిత నగరాల్లో 8 ఆసియా ఖండంలోనే ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో లాహోర్ (97.4 μg/m3) ఉండగా, వరుసగా రెండు మూడు స్థానాల్లో రాజస్తాన్ లోని భివండి (92.7 μg/m3), న్యూఢిల్లీ (92.6 μg/m3) నిలిచాయి. పాకిస్తాన్ లోని షెషావర్ (91.8 μg/m3), భారత్ లోని ధర్బంగ (90.3 μg/m3), అసొపూర్(90.2 μg/m3), పాాట్నా (88.9 μg/m3), ఘజియాబాద్ (88.6 μg/m3), ధరుహెరా (87.8 μg/m3), చాప్రా (85.9 μg/m3) అత్యంత వాయు కాలుష్య ప్రాంతాలుగా నిలిచాయి.

Whats_app_banner

టాపిక్