Independence Day Slogans In Telugu : స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన దేశభక్తి నినాదాలు-independence day 2024 slogans by freedom fighters independence day greetings wishes whatsapp status in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Independence Day Slogans In Telugu : స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన దేశభక్తి నినాదాలు

Independence Day Slogans In Telugu : స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన దేశభక్తి నినాదాలు

Anand Sai HT Telugu
Aug 15, 2024 07:31 AM IST

Independence Slogans In Telugu : నేడు(ఆగస్టు 15) దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. దేశభక్తి భావనతో చుట్టుపక్కల వాతావరణాన్ని నింపడానికి కొన్ని ముఖ్యమైన నినాదాలు ఉన్నాయి. HT Telugu మీకోసం అందిస్తుంది.

స్వాతంత్య్ర దినోత్సవం
స్వాతంత్య్ర దినోత్సవం

నేడు దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశమంతా సంబరాల వాతావరణం నెలకొంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ఉద్యమం ఈ పండుగ శోభను పెంచింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అయితే అందులో స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన నినాదాలు వినిపించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు పోరాడిని గొప్పవారి నినాదాలు ఇప్పటికీ వింటుంటే గుండె ఉప్పొంగుతుంది.

సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హమారా హమ్ బబుల్స్ హై ఇస్ కీ యే గుల్సితాన్ హమారా

సత్యమేవ జయతే : ఈ నినాదాన్ని పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఇచ్చారు.

ఇంక్విలాబ్ జిందాబాద్: భగత్ సింగ్ ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ యువతకు మెుదటి ఎంపిక.

నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను : నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ నినాదాన్ని ఇచ్చారు.

జైహింద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదం ఇప్పటికీ ప్రతి భారతీయుడి పెదవులపై ఉంటంది.

స్వరాజ్యం నా జన్మహక్కు, అది నాకు దక్కుతుంది: బాలగంగాధర తిలక్ ఈ నినాదం ఇచ్చారు.

వందేమాతరం : ఈ నినాదాన్ని బంకించంద్ర ఛటర్జీ ఇచ్చారు.

స్వాతంత్య్రం కోరిక ఇప్పుడు మన గుండెల్లో ఉంది, ఆ పక్క ఎంత బలం ఉందో చూడండి : ఈ నినాదాన్ని రాంప్రసాద్ బిస్మిల్ ఇచ్చారు.

మేము స్వేచ్ఛగా ఉన్నాం, స్వేచ్ఛగా ఉంటాం: చంద్రశేఖర్ ఆజాద్ ఇచ్చారు..

బాంబులు, తుపాకులు విప్లవాన్ని తీసుకురావు, విప్లవ ఖడ్గానికి ఆలోచనల అంచున పదును పెడతారు - భగత్ సింగ్

శత్రువుల తూటాలను ఎదుర్కొంటాం, మనం స్వేచ్ఛగా ఉంటాం. - చంద్రశేఖర్ ఆజాద్

విప్లవ నినాదం.. హిందుస్థాన్ మనది.

త్రివర్ణ పతాకం మనకు గర్వకారణం, భారతీయులకు గర్వకారణం.

జై జవాన్ జై కిసాన్ - లాల్ బహదూర్ శాస్త్రి

భారతదేశం చనిపోతే ఎవరు బ్రతుకుతారు? - పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.

చేయండి లేదా చావండి. - మహాత్మా గాంధీ

స్వరాజ్యం నా జన్మహక్కు, అది నాకు దక్కుతుంది - బాలగంగాధర తిలక్.

దేశం మీ కోసం ఏమి చేయగలదని అడగకండి.. మీ దేశం కోసం మీరేం చేయగలరో ఆలోచించండి. - జవహర్ లాల్ నెహ్రూ.

ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత, వెయ్యి జీవితాల్లో అవతరించుతుంది - నేతాజీ సుభాష్ చంద్రబోస్.

దేశంలో సంక్షోభం వచ్చినప్పుడల్లా స్వాతంత్య్ర ప్రజలు భరతమాత సేవలో మునిగిపోతారు.

ఆ రుణం అమరవీరులదే, కానీ దాన్ని ఎలా తీర్చుకుంటాం, రక్తపు బొట్టు ఉన్నంతవరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం.