Heavy rains alert : నైరుతి రుతుపవనాల ఉపసంహరణ- ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
Heavy rains alert : ఈ నెల 25న నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ.
Heavy rains alert : దేశ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో జోరుగా వర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా.. శనివారం నాడు బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్లోని హిమాలయ ప్రాంతం, ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అదే సమయంలో. వాయువ్య భారతం నుంచి ఈ నెల 25న నైరుతి రుతపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించింది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీకి అటు, ఇటుగా కేరళను తాకుతాయి. అనంతరం ఇండియావ్యాప్తంగా విస్తరిస్తాయి. ఆ తర్వాత.. సెప్టెంబర్ 17కు అటు, ఇటుగా.. వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ ఏడాది రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా 780.3ఎంఎం వర్షపాతం నమోదైంది. గత కొన్నేళ్లుగా చూసుకుంటే.. ఈ సంఖ్య సాధారణంగా ఇది 832.4ఎంఎంగా ఉంటుంది. ఎల్పీఏ (లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 94-106శాతం మధ్యలో వర్షపాతం నమోదైతే.. దానిని సాధారణంగా గుర్తిస్తారు.
వివిధ రాష్ట్రాలపై వర్షాల ప్రభావం ఇలా..
Telangana rain alert : తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. శనివారం నాడు రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జయ్శంకర్ భూపాలపల్లి, ములుగు ప్రాంతాలకు ఈ సూచనలు ఇచ్చింది. ఇక తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి, మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్పింది. రాయలసీమలో కూడా శనివారం అక్కడక్కడ వర్షాలు పడొచ్చు.
దేశ రాజధాని దిల్లీలో శనివారం.. వాతావరణం చల్లగా ఉంటుంది. తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయి.
Southwest monsoon retreat : కోల్కతాలో మాత్రం గత కొన్ని రోజులుగా జోరుగా వానలు పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో నగరంలో 21.8ఎంఎం వర్షపాతం నమోదైంది. శుక్రవారం నాడు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
సంబంధిత కథనం