IBPS Clerk Prelims Results: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-ibps clerk prelims results 2023 released at www ibps in download link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Ibps Clerk Prelims Results 2023 Released At Www.ibps.in, Download Link Here

IBPS Clerk Prelims Results: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Sep 14, 2023 06:06 PM IST

IBPS Clerk Prelims Results: ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడయ్యాయి. ఆ పరీక్షరాసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ www.ibps.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IBPS Clerk Prelims Results: వివిధ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ www.ibps.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ క్లర్క్స్ మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల అవుతుంది. మెయిన్ పరీక్ష అక్టోబర్ నెలలో జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4045 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆన్ లైన్ లో..

ఈ ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 ఆగస్ట్ నెలలో జరిగింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో www.ibps.in. వెబ్ సైట్ ద్వారా తమ ప్రిలిమ్స్ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు www.ibps.in. వెబ్ సైట్ లో సెప్టెంబర్ 21వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ లోపే అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకుని, రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని, సాప్ట్ కాపీ, హార్డ్ కాపీలను భద్రపర్చుకోవాలి.

రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

  • ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ www.ibps.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే CRP Clerical result లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • రిజల్ట్ మీ స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • ఫలితాలను చూసుకుని, ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.