Delhi dowry case : 'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!-husband brother in law booked for dowry death after woman found hanging at home in delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Dowry Case : 'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!

Delhi dowry case : 'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!

Sharath Chitturi HT Telugu
May 15, 2023 05:02 PM IST

Delhi dowry case : ‘నా కూతురిని బాధ పెట్టకండి’ అంటూ ఢిల్లీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్నేళ్లుగా ఆమ వరకట్నం వేధింపులకు గురవుతున్నట్టు తెలుస్తోంది.

'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!
'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!

Delhi dowry case : వరకట్నం వేధింపులు భరించలేక ఢిల్లీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన బిడ్డ గురించి చేతిలో రాసుకుని మరీ ఆమ ప్రాణాలు తీసుకుంది!

సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ..

37ఏళ్ల లక్ష్మి గుప్తా.. తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని టిగ్రి ప్రాంతంలో నివాసముంటోంది. కాగా.. సోమవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించిన ఆమె మృతదేహాన్ని చూసి, ఆమె మరిది పోలీసులకు సమాచారాన్ని అందించాడు.

Delhi dowry death case : ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. లక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎడమ చేతిపై 'నా కూతురిని బాధ పెట్టకండి,' అని రాసి ఉండటాన్ని గమనించారు. ఇంటిని పరిశీలించగా.. పోలీసులకు ఎలాంటి సూసైడ్​ నోట్​ లభించలేదు.

పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

వరకట్నం వేధింపులే కారణమా..?

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ తల్లి ప్రకారం.. లక్ష్మికి 2017 జనవరి 16న జితందర్​ గుప్తా అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి ఆమె వరకట్నం వేధింపులకు గురవుతోంది. జితేందర్​ గుప్తాతో పాటు అతను తమ్ముడు.. కట్నం కోసం లక్ష్మిని మానసికంగా వేధించారు.

Delhi dowry death case news : ఈ మేరకు లక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై సెక్షన్​ 304బీ, 498ఏ, 506, 34 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా.. నిందితులను పోలీసులు ఇంకా అరెస్ట్​ చేయలేదని తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

Delhi woman suicide : ఢిల్లీ ఎయిమ్స్​లో మహిళ పోస్టుమార్టం జరగనుందని, అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం