New Parliament building : నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర ఇది..
New Parliament building inauguration : నూతన పార్లమెంట్ భవన నిర్ణాణంలో వివిధ రాష్ట్రాల పాత్ర కూడా ఉంది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆ విశేషాలు చూద్దాము..
New Parliament building inauguration : దిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనం విశేషాలు వార్తల్లో నిలిచాయి. అయితే ఈ భవనం నిర్మాణంలో వివిధ రాష్ట్రాల పాత్ర కూడా ఉంది! అ వివరాలు చూద్దాము..
రాళ్ల నుంచి శిల్పాలు చెక్కడం వరకు..!
నూతన పార్లమెంట్ భవనం నిర్ణాణంలో వినియోగించిన సాండ్స్టోన్ (ఇసుకరాయి)ని రాజస్థాన్ సర్మాథుర నుంచి తీసుకొచ్చారు. దిల్లీలోని హుమాయున్ టోంబ్, ఎర్ర కోటను కూడా ఇదే సాండ్‌స్టోన్‌తో నిర్మించడం విశేషం.
లోక్‌సభ ఛాంబర్లోని కేషారియా గ్రీన్ స్టోన్‌ను ఉదయ్‌పూర్ నుంచి తీసుకొచ్చారు. రాజ్యసభ ఛాంబర్లోని రెడ్ గ్రనైట్ను అజ్మీర్‌లోని లఖా నుంచి తెల్ల పాలరాయి మెటీరియల్‌ను అంబాజీ నుంచి తీసుకొచ్చారు.
నూతన పార్లమెంట్ భవనంలో వినియోగిస్తున్న ఫర్నీచర్‌ను ముంబైలో తయారు చేశారు. బిల్డింగ్‌లో ఉపయోగించిన టేకు చెక్కను నాగ్‌పూర్ నుంచి తీసుకొచ్చారు.
భవనంలోని ఫాల్స్ సీలింగ్‌కు ఉపయోగించిన స్టీల్‌ను దమన్ అండ్ దియూ నుంచి, అశోక చిహ్నాన్ని రూపొందించేందుకు కావాల్సిన మెటీరియల్‌ను ఔరంగాబాద్, జైపూర్ నుంచి తీసుకొచ్చారు.
లోక్‌సభ, రాజ్యసభలో ఏర్పాటు చేసిన ఆశోక చక్రాలను ఇండోర్ నుంచి తీసుకొచ్చారు.
New Parliament building inauguration Live : నూతన పార్లమెంట్ భవనంలో ఉన్న లాటిస్ వర్క్ (జాలులు)ను ఉత్తర్ ప్రదేశ్, నోయిడా, రాజస్థాన్‌లో రూపొందించారు.
భవనం నిర్మాణం కోసం వాడిన కంకరరాళ్లను కోట్‌పుట్లి నుంచి తీసుకొచ్చారు. శిల్పాలను చెక్కిన వారు ఉదయ్‌పూర్ నుంచి వచ్చారు.
ఫ్లై యాష్ ఇటుకలను హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ నుంచి బ్రాస్ వర్క్- ప్రీ కాస్ట్ ట్రెంచెస్ను అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలోని ఫాల్స్ సీలింగ్ స్ట్రక్చర్‌ను దమన్ దయూల తయారు చేశారు.
రాళ్లను చెక్కే పని ఉదయ్‌పూర్ అబు రోజ్లో జరిగింది.
ప్రారంభోత్సవ వేడుకలు..
పార్లమెంట్ భవనంలో ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజదండాన్ని లోక్‌సభలోని స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్టించారు. భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను సత్కరించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో సర్వ ధర్మ ప్రార్థనలు జరిగాయి.
హై సెక్యూరిటీ మధ్య పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దిల్లీ వ్యాప్తంగా అధికారులు ఆంక్షలు విధించారు.
సంబంధిత కథనం