Crime news : మఠంలో భక్తురాలిపై 8ఏళ్లుగా అత్యాచారం- పూజారి అరెస్ట్​!-hangarahalli vidya chowdeshwari mutt priest held for raping minor for 7 years ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : మఠంలో భక్తురాలిపై 8ఏళ్లుగా అత్యాచారం- పూజారి అరెస్ట్​!

Crime news : మఠంలో భక్తురాలిపై 8ఏళ్లుగా అత్యాచారం- పూజారి అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Mar 09, 2024 09:00 AM IST

కర్ణాటకలో ఓ మఠానికి చెందిన పూజారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. భక్తులను ఆయన కొన్నేళ్లుగా రేప్​ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

మహిళా భక్తులపై పూజారి అత్యాచారం!
మహిళా భక్తులపై పూజారి అత్యాచారం!

Hangarahalli Vidya Chowdeshwari Mutt : కర్ణాటకలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మఠానికి చెందిన పూజారి, పలువురిపై చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టు పోలీసులకు తెలిసింది. ఆయన్ని అధికారులు అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

కర్ణాట కుణిగళ్​ టౌన్​లోని హంగరహల్లి విద్య చౌదేశ్వరి మఠంలో జరిగింది ఈ ఘటన. 35ఏళ్ల బాలమంజునాథ్​ స్వామి.. మఠంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఆయనకి అభిషేక్​ పేరుతో ఓ అసిస్టెంట్​ ఉన్నాడు.

కాగా.. బాలమంజునాథ్​ స్వామి.. ఫిబ్రవరి 10న అభిషేక్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పర్సనల్​ అసిస్టెంట్​తో పాటు మరో ఐదుగురు.. తన వీడియోలను తీసి బెదిరిస్తున్నారని, డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహిళా డాక్టర్​ నుంచి చర్మానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్న సమయంలో వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెప్పాడు.

Hangarahalli Vidya Chowdeshwari Mutt priest : మఠం పూజారి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్​ చేశారు. అప్పుడే.. ఈ కేసు కీలక మలుపు తిరిగింది!

విచారణలో భాగంగా అభిషేక్​ని పోలీసులు ప్రశ్నించగా కీలక విషయాలు బయపడ్డాయి. ఆ మహిళా డాక్టర్​ని.. ఆ పూజారి గత కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత.. పూజారి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మఠంలో మరో మహిళా భక్తురాలిపై గత 8ఏళ్లుగా ఆ పూజారి అత్యాచారం చేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.

"బాధితులను కలిసి.. వారి స్టేట్​మెంట్​ని రికార్డ్​ చేశాము. తనపై పూజారి గత 7ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టు బాధితుల్లో ఒకరు చెప్పారు. మొదట్లో ఆమె ఒక మైనర్​. అందుకే నిందితుడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు వేశాము," అని అధికారులు వెల్లిడించారు.

గురువారం రాత్రి.. పోలీసులు మఠం పూజారిని అరెస్ట్​ చేశారు.

Mutt priest raped minor : "పూజారిని గురువారం రాత్రి అరెస్ట్​ చేశాము. శుక్రవారం.. జేఎంఎఫ్​సీ కోర్టులో హాజరుపరిచాము. ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యుడీషయల్​ కస్టడీలో ఉన్నాడు. ఈ పూజారి ఇంకెంతమందిపై లైంగిక దాడి చేశాడు? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము," అని తుమకూరు ఎస్​పీ అశోక్​ తెలిపారు.

సంబంధిత కథనం