Israel war : హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన మహిళ మృతి
Shani Louk death : ఇజ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో.. హమాస్ చేతుల్లో కిడ్నాప్‌కు గురైన జర్మనీ మహిళ మృతిచెందింది. మరణానికి ముందు.. ఆమెను, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు ఉగ్రవాదులు!
Shani Louk death : ఇజ్రాయెల్‌పై దండయాత్ర చేసిన అనంతరం.. హమాస్ ఉగ్రవాదులు, ఓ మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా రోడ్లపై ఊరేగించారు. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. కాగా.. ఈ ఘటనలో బాధితురాలి మృతిచెందినట్టు, ఆమె కుటుంబం తాజాగా ప్రకటించింది.
ఇదీ జరిగింది..
జర్మనీకి చెందిన షానీ లౌక్ అనే మహిళ.. మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లింది. అక్టోబర్ 7న ఈ ఈవెంట్ జరిగింది. సరిగ్గా అదే సమయంలో.. ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటిస్తూ.. 5వేలకుపైగా రాకెట్లతో విరుచుకుపడింది హమాస్ బృందం. ఆ వెంటనే.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్ వీధుల్లో బీభత్సం సృష్టించారు. మ్యూజుక్ ఫెస్టివల్లోకి ప్రవేశించి, హింసను రేకెత్తించారు. ఒక్కొక్కరినీ కాల్చుకుంటూ వెళ్లారు. కాగా.. అదే సమయంలో షానీ లౌక్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత.. ఆమెను నగ్నంగా చేసి, ట్రక్‌లో వీధుల్లో ఊరేగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ దేశాలు, హమాస్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
Shani Louk latest news : కాగా.. షానీ లౌక్ బతికే ఉందా? లేదా? అన్ని విషయంపై ఆ వీడియోలో స్పష్టత రాలేదు. తన బిడ్డను కాపాడాలని షానీ లౌక్ తల్లి రికార్డ.. ప్రపంచ దేశాలను వేడుకున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చి అభ్యర్థనలు చేశారు. కొన్ని గంటల తర్వాత.. మరో అప్డేట్ ఇచ్చారు. "షానీ లౌక్కు తీవ్రంగా గాయాలయ్యాయి. గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స ఇస్తున్నారని తెలిసింది," అని పోస్ట్ చేశారు.
షానీ లౌక్ సురక్షితంగా ఉండాలని, గాయాల నుంచి కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేశారు. కానీ ఈ ప్రార్థనలు ఫలించలేదు. షానీ లౌక్ మృతదేహాన్ని గుర్తించినట్టు, పోలీసులు.. ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.
Israel Palestine war : "నా సోదరి మరణించిందని చెప్పడం చాలా బాధగా ఉంది. పోలీసులు ఆమెను కనుగొన్నారు. ఆమెను గుర్తించారు. ఆమె మరణించింది," అని షానీ లౌక్ సోదరి.. ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
షానీ లౌక్కు జర్మన్ పౌరసత్వంతో పాటు ఇజ్రాయెల్ సిటీజెన్షిప్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. ఆమె ఎప్పుడూ జర్మనీలో నివాసం ఉండలేదు. బంధువులను చూసేందుకు మాత్రమే వెళ్లేది. ఆమె తల్లికి జర్మన్ మూలలు ఉన్నాయి. చాలా కాలం క్రితం, ఆమె తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌కు వలస వచ్చేసింది.
సంబంధిత కథనం