Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన మాజీ జడ్జీలు-former hc judges bureaucrats write to cji seeking action udayanidhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన మాజీ జడ్జీలు

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన మాజీ జడ్జీలు

HT Telugu Desk HT Telugu
Sep 05, 2023 04:18 PM IST

Udhayanidhi Stalin: సనాతన ధర్మాన్ని (Santana Dharma) సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. తాజాగా, పలువురు హై కోర్టు మాజీ జడ్జీలు, ఉన్నతాధికారులు ఉదయనిధిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.

ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్

Udhayanidhi Stalin: సనాతన ధర్మాన్ని (Santana Dharma) సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత, రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఉదయనిధి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక వర్గం, మద్ధతుగా మరో వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నాయి.

సుప్రీంకోర్టు కు ఫిర్యాదు

ఈ నేపథ్యంలో ఉదయ నిధి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ పలువురు హై కోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఉదయనిధి వ్యాఖ్యలు సమాజంలో మతపరమైన విద్వేషాలకు, హింసాత్మక ఘటనలకు కారణమవుతాయని, ఆ వ్యాఖ్యలను హేట్ స్పీచ్ గా పరిగణించాలని వారు సుప్రీంకోర్టు ను కోరారు. ఉదయ నిధి వ్యాఖ్యలతో భారత్ తో సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి మనస్సులు గాయపడ్డాయని తెలిపారు. ఈ లేఖపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యస్ యన్ ధింగ్రా, కేంద్ర షిప్పింగ్ శాఖ మాజీ కార్యదర్శి గోపాలకృష్ణ సహా 14 మంది మాజీ న్యాయమూర్తులు, 130 మంది ఉన్నతాధికారులు, 118 మంది సైనిక అధికారులు ఈ లేఖపై సంతకం చేశారు. వీరిలో 20 మంది మాజీ రాయబారులు కూడా ఉన్నారు. షాహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వీరు ఆ లేఖలో ఉటంకించారు. దేశ లౌకికత ను కాపాడడానికి ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవడం అత్యవసరమని వారు పేర్కొన్నారు.

ఇంతకీ ఉదయనిధి ఏమన్నారు?

చెన్నైలో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని వ్యాఖ్యనించారు. సామాజిక న్యాయం భావనకు సనాతన ధర్మం వ్యతిరేకమన్నారు. ‘‘కొన్నింటిని వ్యతిరేకించడం సరిపోదు. వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిందే. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా, కొరోనా వంటి వాటిని వ్యతిరేకించడం సరిపోదు. వాటిని సమూలంగా నిర్మూలించాలి. అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి’’ అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడానికిి కానీ, క్షమాపణలు చెప్పడానికి కానీ ఉదయ నిధి స్టాలిన్ అంగీకరించలేదు. అవసరమైతే, ఆ వ్యాఖ్యలను మరోసారి చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు.

IPL_Entry_Point