Flipkart Big Saving Days : బిగ్​ సేవింగ్​​ డేస్ షురూ​.. ఐఫోన్​పై భారీ డిస్కౌంట్లు!-flipkart big saving days big offers on iphone 13 iphone 12 pro iphone se ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Flipkart Big Saving Days: Big Offers On Iphone 13, Iphone 12 Pro, Iphone Se

Flipkart Big Saving Days : బిగ్​ సేవింగ్​​ డేస్ షురూ​.. ఐఫోన్​పై భారీ డిస్కౌంట్లు!

Sharath Chitturi HT Telugu
Aug 06, 2022 09:36 AM IST

Flipkart Big Saving Days : మీరు ఐఫోన్​ కొనాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారా? అయితే మీ నిరీక్షణకు తెరపడింది. అద్భుత ఆఫర్లతో వచ్చేశాయి ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​​ డేస్​.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్స్​ డే షురూ..
ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్స్​ డే షురూ.. (REUTERS)

Flipkart Big Saving Days : అదిరిపోయే ఆఫర్స్​తో ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​​ డేస్​.. భారతీయులను పలకరించాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ బిగ్​ సేవింగ్​​ డేస్​.. శనివారం లైవ్​లోకి వచ్చాయి. ఫ్యాషన్​, స్మార్ట్​ఫోన్​, ల్యాప్​టాప్​, ట్యాబ్​తో పాటు ఇతర ఎలక్ట్రానిక్​ పరికరాలపై డిస్కౌంట్లు, ఆఫర్​ను ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

ట్రెండింగ్ వార్తలు

బిగ్​ సేవింగ్​​ డేస్​ కోసం ఐసీఐసీఐ బ్యాంక్​, కొటాక్​ బ్యాంక్​తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది ఫ్లిప్​కార్ట్​. ఫలితంగా ఆయా వినియోగదారులకు.. 10శాతం డిస్కౌంట్​ లభిస్తుంది.

ఐఫోన్​ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి.. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్స్​ డేస్​ మంచి అవకాశం! బ్యాంక్​ ఆఫర్లు, ఎక్స్​ఛైంజ్​ డిస్కౌంట్​లతో పాటు.. యాపిల్​ ఐఫోన్​లపై మరిన్ని ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. అవేంటంటే..

ఐఫోన్​ 12.. రూ. 58,999

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​​ డేస్​ వేళ ఐఫోన్​ 12.. రూ. 58,999కే లభించనుంది. వాస్తవానికి ఈ ఐఫోన్​ 12 ధర రూ. 63,499. ఐసీఐసీఐ బ్యాంక్​తో రూ. 5వేల ఆఫర్లు పొందవచ్చు.

ఐఫోన్​ ఎస్​ఈ.. రూ. 41,900

ఐఫోన్​ ఎస్​ఈ బేస్​ మోడల్​(64జీబీ).. రూ. 41,900కే లభిస్తోంది. ఇందులో ఐఓఎస్​ 15 ఆపరేటింగ్​ సిస్టమ్​ ఉంటుంది. యాపిల్​ ఏ15 బయోనిక్​ చిప్​సెట్​ కూడా లభిస్తుంది. 12ఎంపీ కెమెరా, 7ఎంపీ సెకండరీ కెమెరా దీని సొంతం.

ఐఫోన్​ 13.. రూ. 69,999

ఈ ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​లో.. ఐఫోన్​ 13 రూ. 69,999కే అందుబాటులో ఉండనుంది. ఇందులో 6.1ఇంచ్​ సూపర్​ రెటినా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే ఉంటుంది. ఏ15 బయోనిక్​ చిప్​సెట్​ దీని సొంతం. పింక్​, బ్లూ, బ్లాక్​, ప్రాడక్ట్​ రెడ్​, స్టార్​లైట్​ రంగుల్లో ఈ ఐఫోన్​ అందుబాటులో ఉండనుంది.

ఐఫోన్​ 12 ప్రో.. రూ. 1,09,150

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ సేవింగ్​ డేస్​లో భాగంగ.. ఐఫోన్​ 12 ప్రో.. రూ. 1,09,150కి అందుబాటులో ఉండనుంది. ఇందులో 12ఎంపీ ట్రిపుల్​ కెమెరా ఉంటుంది. ఏ14 బయోనిక్​ ప్రాసెసర్​ దీని సొంతం.

ఐఫోన్​ 11.. రూ. 41,999

ఐఫోన్​ 12 రూ. 41,999కి వచ్చేస్తోంది. ఇందులో 6.1 ఇంచ్​ ఎల్​సీడీ రెటినా డిస్​ప్లే ఉంటుంది. 12ఎంపీ డ్యూయెల్​ రేర్​ కెమెరా, 12ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం.

మరోవైపు.. ఇప్పటికే మొదలైన అమెజాన్​ గ్రేట్​ ఫ్రీడం ఫెస్టివల్​ సేల్​ ఈనెల 10తో ముగియనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్