Crime news : 5ఏళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ - నిందితుల్లో ఒకరి వయస్సు 6ఏళ్లు!
Ballia rape case : యూపీలో ఓ 5ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరు మైనర్లే. పైగా అందులో ఒకరి వయస్సు 6ఏళ్లే!
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 5ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులందరు మైనర్లే కావడం గమనార్హం! మరీ ముఖ్యంగా ముగ్గురు నిందితుల్లో ఒకరి వయస్సు 6ఏళ్లే కావడం.. సమాజంలో తాజా పరిస్థితులపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాల్లియా జిల్లాలో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది. 6, 13, 16 ఏళ్ల వయసున్న నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలికను ముగ్గురు బాలురు ఇంటి పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. అక్కడ వారు అద్దెకు ఉంటున్నారని వివరించారు.
సామూహిక అత్యాచార సమాచారం అందుకున్న ఎస్పీ వీర్ సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందంతో కలిసి పరిశీలించారని ఎస్హెచ్ఓ తెలిపారు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) యోగేంద్ర బహదూర్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి:- Salman Khan: ‘బాబా సిద్ధిఖీ హత్య కంటే దారుణంగా..’ - సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సింగ్ వెల్లడించారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. మైనర్లు అఘాయిత్యానికి ఒడిగట్టారన్న వార్త విని చాలా మంది షాక్‌కు గురవుతున్నారు. అసలు సమాజం ఏమైపోతోందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిపోతున్న నేరాలు..
ఈ బాల్లియా జిల్లాలో ఇటీవలి కాలంలో ఆఘాయిత్యాలు, నేరాలు పెరిగిపోయాయి. గత నెలలో బాల్లియాలోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 7ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. నిర్మానుష్య ప్రదేశంలో 8 ఏళ్ల బాలుడు, 7 ఏళ్ల వయసున్న మరో బాలుడు, ఆ బాలికను రేప్ చేశారు. చుట్టుపక్కల నివసించే ఈ ఇద్దరు మైనర్లు ఆడుకుందామని బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
రక్తస్రావమై ఇంటికి వచ్చిన బాధితురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా మహిళా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ప్రభుత్వ చిల్డ్రన్స్ షెల్టర్ హోమ్‌కు పోలీసులు తరలించారు.
సంబంధిత కథనం