Father rapes daughter : కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి..-father rapes daughter in rajasthan town accused arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Father Rapes Daughter : కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి..

Father rapes daughter : కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి..

Sharath Chitturi HT Telugu
Jul 11, 2022 06:51 PM IST

Father rapes daughter : రోజు రాత్రి ఇంటికి తాగి వెళతాడు ఆ వ్యక్తి. కన్న కూతురు అని కూడా చూడకుండా.. నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చింది.

<p>కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి..</p>
కూతురిపై అఘాయిత్యం.. నాలుగు నెలలుగా ప్రతి రోజు రాత్రి.. (HT Telugu)

Father rapes daughter : రాజస్థాన్​లో మానవ జాతి తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల కూతురిపై నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ కిరాతక తండ్రి.

రాత్రి పూట.. తాగొచ్చి..

బారాన్​ జిల్లాలోని అట్రు ప్రాంతంలో ఓ 31ఏళ్ల వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మొదటి భార్య మరణంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.

కానీ ఆ వ్యక్తికి తాగడం అలవాటు. రోజు రాత్రి తాగొచ్చి ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు. ఇది తట్టుకోలేక.. రెండో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. పెద్ద కూతురిపై అతని కళ్లు పడ్డాయి!

Rajasthan crime news : నాలుగు నెలలుగా రోజు రాత్రి మద్యం తాగొచ్చి.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు ఆ కిరాతకుడు. ఆమె నరకం అనుభవిస్తూనే ఉంది.

ఎట్టకేలకు.. ధైర్యం తెచ్చుకుని స్నేహితురాలితో కలిసి శనివారం రాత్రి అట్రు పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తనకు జరిగినది పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిందితుడుని అరెస్ట్​ చేశారు.

బాధితురాలు ఐదో తరగతి వరకే చదువుకుంది. మొదటి భార్య మరణం అనంతరం ఆమెను చదువు మానిపించేశాడు ఆ తండ్రి.

Whats_app_banner

సంబంధిత కథనం