Aravind Kejriwal CBI : సీబీఐ ఎదుట కేజ్రీవాల్.. ఆప్ నేతల నిరసనలు
Aravind Kejriwal CBI : లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఆమ్ ఆద్మీ శ్రేణులు ఢిల్లీవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
Aravind Kejriwal news : ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్.. సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆదివారం ఉదయం వెళ్లిన సీఎంపై లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా అధికారులు విచారణ చేపట్టారు.
"సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు నేను జవాబు చెబుతాను. కానీ నేను అరెస్ట్ అవుతానని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీబీఐని బీజేపీ నియంత్రిస్తోందని స్పష్టమవుతోంది," అని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు కేజ్రీవాల్.
కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మన్, ఢిల్లీ మంత్రులు, ఎంపీలు కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.
మహాత్ముడికి నివాళి అర్పించి..
Aravind Kejriwal latest news : అంతకుముందు.. ఆదివారం ఉదయం తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు అరవింద్ కేజ్రీవాల్. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. అక్కడి నుంచి బయలు దేరే ముందు మీడియాతో మాట్లాడారు కేజ్రీవాల్.
"కొన్ని దేశ విద్రోహ శక్తులు.. దేశాభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. ఇలా చేసే వారికి నేను ఒకటే చెబుతున్నా. దేశాభివృద్ధి కొనసాగుతుంది," అని కేజ్రీవాల్ అన్నారు.
Delhi liquor scam latest updates : తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు కేజ్రీవాల్. పంజాబ్ సీఎం, కేజ్రీవాల్‌తో కలిసి అక్కడికి వెళ్లారు.
మరోవైపు కేజ్రీవాల్‌పై సీబీఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రోడ్లెక్కారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ పరిణామాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్..
Aravind Kejriwal liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కేజ్రీవాల్ హస్తం కూడా ఉందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. కాగా.. ఈడీ, సీబీఐలు తనను తప్పుగా ఇరికిస్తున్నాయని పలు మార్లు మండిపడ్డారు కేజ్రీవాల్. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం