cheetah dies in Kuno: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన వాటిలో మరో చీతా మృతి-eighth cheetah dies in kuno injury marks on body say officials ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cheetah Dies In Kuno: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన వాటిలో మరో చీతా మృతి

cheetah dies in Kuno: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన వాటిలో మరో చీతా మృతి

HT Telugu Desk HT Telugu
Jul 14, 2023 08:07 PM IST

cheetah dies in Kuno: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మరో చీతా మృతి చెందింది. చీతా వంటిపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. చీతా బరువు కూడా భారీగా తగ్గిందని వివరించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

cheetah dies in Kuno: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మరో చీతా మృతి చెందింది. చీతా మెడపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. చీతా బరువు కూడా భారీగా తగ్గిందని వివరించారు.

cheetah dies in Kuno: చీతా వంటిపై గాయాలు..

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాలను మధ్య ప్రదేశ్ లోని కునొ నేషనల్ పార్క్ (Kuno National Park) లో వదిలిపెట్టారు. ప్రధాని మోదీ (PM Modi) పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వాటిని కునొ నేషనల్ పార్క్ లో వదిలిపెట్టారు. వాటిలో ఒక మగ చీతా ఇప్పుడు మరణించింది. సూరజ్ అనే పేరున్న ఆ చీతా (cheetah) మెడపై గాయాలున్నాయని, ఆ గాయాలు ఎలా అయ్యాయో పోస్ట్ మార్టంలో తేలుతుందని వైద్యులు తెలిపారు. కునొ నేషనల్ పార్క్ లో శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ అండ్ మానిటరింగ్ టీమ్ కు ఈ చీతా పూర్తిగా బలహీనంగా, పడిపోయిన స్థితిలో కనిపించింది. వీరు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే ఆ చీతా మరణించింది. దాని బరువు కూడా భారీగా తగ్గింది. ఈ ఫిబ్రవరిలో దాదాపు 55 కేజీలు ఉన్న ఆ చీతా ఇప్పుడు 43 కేజీలకు తగ్గిందని తెలిపారు.

8 చీతాలు చనిపోయాయి..

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఇప్పటివరకు 8 చీతాలు మరణించాయి. ఈ నెలలోనే రెండు చీతాలు చనిపోయాయి. మూడు రోజుల క్రితమే తేజస్ అనే మగ చీతా మరణించింది. ప్రస్తుతం ఆ పార్క్ లో ఒక చిన్న చిరుత సహా 16 చీతాలున్నాయి. కేవలం 16 చదరపు కిమీల విస్తీర్ణం ఉన్న ప్రాంతంలో ఉండాల్సి రావడం వల్ల ఆ చీతాల్లో అనారోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చని దక్షిణాఫ్రికా చీతా ఎక్స్ పర్ట్ ఆడ్రియన్ టార్డిఫ్ తెలిపారు. ఆ చీతాలను క్వారంటైన్ పీరియడ్ తరువాత నేరుగా అడవిలో వదిలి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు.

Whats_app_banner