Bone Growth In Penis : మోకాలి నొప్పితో వచ్చిన వ్యక్తికి ఎక్స్ రే తీస్తే షాక్.. పురుషాంగంలో ఎముక పెరుగుదల-doctors discover bone growth in mans penis after x ray for knee pain know what is this disease ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bone Growth In Penis : మోకాలి నొప్పితో వచ్చిన వ్యక్తికి ఎక్స్ రే తీస్తే షాక్.. పురుషాంగంలో ఎముక పెరుగుదల

Bone Growth In Penis : మోకాలి నొప్పితో వచ్చిన వ్యక్తికి ఎక్స్ రే తీస్తే షాక్.. పురుషాంగంలో ఎముక పెరుగుదల

Anand Sai HT Telugu
Sep 16, 2024 08:05 PM IST

Bone Growth In Penis : మోకాలి నొప్పితో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. అయితే అతడికి ఎక్స్ రే తీయగా షాకింగ్ విషయం బయటపడింది. అది ఏంటంటే.. అతడి పురుషాంగంలో ఎముక పెరుగుదల కనిపించింది. ఇది చూసిన వైద్యులు అవాక్కయ్యారు.

వ్యక్తికి పురుషాంగంలో ఎముక పెరుగుదల(ప్రతీకాత్మక చిత్రం)
వ్యక్తికి పురుషాంగంలో ఎముక పెరుగుదల(ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)

ఓ వ్యక్తి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పురుషాంగంలో ఎముక పెరుగుతున్నట్టుగా వైద్యులు గుర్తించారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అతడు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. పురుషాంగంలో ఎముక పెరిగేందుకు పలు కారణాలు ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. యూరాలజీ కేస్ రిపోర్ట్స్‌ సెప్టెంబరు సంచికలో దీని గురించి ప్రస్తావించారు.

మోకాళ్ల నొప్పులతో 63 ఏళ్ల వ్యక్తి బాధపడుతున్నాడు. అయితే దీని కోసం చికిత్స చేసుకునేందుకు ఆసుపత్రికి వచ్చాడు. ఎక్స్ రే తీయగా.. పురుషాంగం ఆసిఫికేషన్‌(ఎముకగా పరిణామం చెందుట)కు సంబంధించిన ఊహించని రోగ నిర్ధారణ గురించి తెలిసి అవాక్కయ్యాడు. ఆ వ్యక్తి మోకాలి నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లాడు. నడవగలిగినా మోకాళ్ల నొప్పులు రావడంతో వైద్యులకు సమాచారం అందించాడు. వైద్య పరీక్షల సమయంలో పురుషాంగం నొప్పుల గురించి కూడా చెప్పాడు.

అతడు ఓసారి కింద పడనట్టుగా తెలిపాడు. దీంతో తుంటి మీద పడినందున, ఎముకలు విరిగిపోయాయేమోనని వైద్యులు భావించారు. మొదట ఎక్స్-రే చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో వైద్యులు చాలా విచిత్రమైన విషయాన్ని గమనించారు. అతడి పురుషాంగంలో ఆసిఫికేషన్ కలిగి ఉన్నట్లు అనిపించింది. అంటే పురుషాంగం లోపల ఎముక పెరుగుదల కనిపించింది. దీంతో మనిషికి పెనైల్ ఆసిఫికేషన్(penile ossification) ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అయితే డాక్టర్లు ఎంత చెబుతున్నా అతడు వినిపించుకోలేదు. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతని వ్యాధి మూలాన్ని గుర్తించడానికి అవసరమైన పరీక్షలను వైద్యులు చేయలేకపోయారు. అయినప్పటికీ అతడికి ఉన్న పరిస్థితిని చూస్తే.. పెరోనీ వ్యాధిని కలిగి ఉన్నాడని వైద్యులు భావిస్తున్నారు.

'పెనైల్ ఆసిఫికేషన్ అనేది చాలా తక్కువ మందిలో కనిపించే ఒక అరుదైన పరిస్థితి. ఇది చాలా తక్కువ మందికి వస్తుంది. దీనిపై 40 కంటే తక్కువ ప్రచురించిన కేస్ రిపోర్టులు ఉన్నాయి. సాధారణంగా పెరోనీస్ వ్యాధితో ముడిపడి ఉంటుంది. నొప్పితో లేదా నొప్పి లేకుండా పురుషాంగ వైకల్యానికి దారితీసే సమస్య ఇది.'అని వైద్యులు చెప్పారు.