Gurmeet Ram Rahim : ఆ కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ నిర్దోషి..!
Gurmeet Ram Rahim news : మాజీ మేనేజర్ హత్య కేసులో.. డేరా సచ్ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది పంజాబ్- హరియాణా హైకోర్టు. మరో నలుగురిని కూడా నిర్దోషిగా తేల్చింది.
Gurmeet Ram Rahim acquitted : సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే డేరా సచ్ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్.. ఓ మర్డర్ కేసులో తాజాగా నిర్దోషిగా తేలారు! మాజీ మానేజర్ హత్య కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రహీమ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చుతూ మంగళవారం కీలక తీర్పును వెలువరించింది పంజాబ్- హరియాణా హైకోర్టు.
ఇదే కేసులో.. డేరా బాబాగా గుర్తింపు పొందిన రహీమ్‌తో పాటు ఆ నలుగురిని దోషిగా తేల్చుతూ.. 2021లో జీవిత ఖైదు శిక్ష వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. దానిపై విచారణ చేపట్టిన అనంతరం.. ఈ ఐదుగురిని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు.
'మాజీ మేనేజర్ హత్యలో గుర్మీత్ నిర్దోషి..'
19ఏళ్ల క్రితం, 2002 జులై 10న.. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ని కొందరు కాల్చి చంపేశారు. హరియాణా కురుక్షేత్రంలోని కాన్పూర్ కోలియన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. డేరా హెడ్‌క్వార్టర్స్‌లో గుర్మీత్ రామ్ రహ్మీమ్.. మహిళపై లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ.. నాడు కొన్ని లేఖలు కలకలం సృష్టించాయి. దీని వెనుక.. మేనేజర్ రంజిత్ సింగ్ హస్తం ఉందన్న అనుమానంతో, ఆతడిని గుర్మీత్ చంపించారని ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో నివాసముండే సాధ్వీలపై గుర్మీత్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని లేఖలో ఉంది. ఇదే లెటర్ ఆధారంగా.. సిర్సాలోని జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి.. ఓ పెద్ద రిపోర్టును రూపొందించారు. ఇది.. కేసులో కీలకంగా మారింది.
Gurmeet Ram Rahim latest news : సెక్షన్ 302ఏ, సెక్షన్ 120బీ, సెక్షన్ 506 కింద కేసులు ఎదుర్కొంటున్న గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు అవతార్ సింగ్, జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, కిషన్ లాల్‌లను తాజాగా పంజాబ్- హరియాణా హైకోర్టు విడిచిపెట్టింది.
"మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ని పంజాబ్- హరియాణా హైకోర్టు నిర్దోషిగా తేల్చింది," అని తీర్పు వెలువడిన అనంతరం.. మీడియాతో చెప్పారు గుర్మీత్ రామ్ రహీమ్ న్యాయవాదులు.
Gurmeet Ram Rahim : కాగా.. గుర్మీత్ రామ్ రహీమ్.. తన ఇద్దరు భక్తురాళ్లను రేప్ చేసిన కేసులో 20ఏళ్ల శిక్ష ఎదుర్కొంటున్నారు. 2001 జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి మర్డర్ కేసులోనూ డేరా బాబా దోషిగా తేలారు. ఈ కేసులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నారు. 2015లో రాష్ట్రంలో జరిగిన అనేక మతపరైన విషయాలకు సంబంధించిన కేసుల్లోనూ డేరా బాబా హస్తం ఉందని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆయన.. హరియాణా రోహ్తక్లోని సునారియా జైలులో ఉన్నారు. కాగా.. ఇప్పటికే అనేకమార్లు పెరోల్‌పై బయటకు వచ్చారు. ఇది.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం