Delhi Girl raped : 19ఏళ్ల యువతిపై ‘ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్’ అత్యాచారం.. ఏడాదిగా!
Delhi Girl raped : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని నమ్మింది ఆ యువతి. అదే ఆమె చేసిన నేరం! ఆమెను లొంగదీసుకుని, ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఆ వ్యక్తి. ఇందుకు సంబంధించి గురుగ్రామ్‌లో కేసు నమోదైంది.
Delhi Girl raped : గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ యువతిపై.. తన ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తన స్నేహితులతో కూడా సెక్స్ చేయాలని అతను డిమాండ్ చేస్తుండటంతో, చివరికి ఆ యువతి, పోలీసులను ఆశ్రయించింది.
మైనర్‌గా ఉన్నప్పటి నుంచే..!
సంబంధిత బాలిక ఢిల్లీలో నివాసముంటోంది. కాగా 2020లో, మైనర్‌గా ఉన్నప్పుడు.. ఆమెకు అభిషేక్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు గురుగ్రామ్‌లోని ఓ పార్కులో తొలిసారి కలిశారు.
Gurugram rape case : 2021 సెప్టెంబర్‌లో అభిషేక్‌ను ఆ యువతి మళ్లీ కలిసింది. గురుగ్రామ్‌లోని ఎంజీఎఫ్ మాల్ ఇందుకు వేదికైంది. అక్కడి నుంచి ఆమెను ఓ గెస్ట్ హౌజ్‌కి తీసుకెళ్లాడు అభిషేక్. అక్కడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
అప్పటి నుంచి ఆ యువతిని అభిషేక్ లొంగదీసుకున్నాడు. బెదిరింపులకు పాల్పడి.. ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతున్నాడు.
స్నేహితులతో కూడా..!
Instagram friend rapes Delhi girl : ఇటీవలే అభిషేక్ మరో దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితులతో కూడా పడుకోవాలని, లేకపోతే వీడియోలు లీక్ చేస్తానని, చంపేస్తానని బెదిరించాడు. ఆ యువతి విలవిలలాడిపోయింది. ఇక అతని వేధింపులు తట్టుకోలేక.. పోలీసులను ఆశ్రయించింది. గురుగ్రామ్ డీఎల్ఎఫ్ ఫేజ్ 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి ఆమె స్టేట్మెంట్ కోసం కోర్టుకు తీసుకెళ్లారు.
మరోవైపు నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు.. సంబంధిత ప్రాంతాల్లో రైడ్లు నిర్వహిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని బాధిత కుటుంబానికి హామీనిచ్చారు.
14ఏళ్ల బాలికపై..
Uttar Pradesh rape case : దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఓ 14ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడిన ఘటన.. తాజాగా నాగ్రా ప్రాంతంలో కలకలం సృష్టించింది.
బాలిక కనిపించడం లేదన్న ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేసి కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. 21ఏళ్ల హరికేశ్.. అప్పటికే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
UP minor girl raped : ఘటనపై పోక్సోతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.