Instagram nudity protection feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇక ఆ ఫొటోల నుంచి రక్షణ!
Instagram nudity protection feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ సెక్షన్లో లైంగిక, అసభ్యకరమైన ఫొటోలతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు.. సరికొత్త ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ తీసుకొస్తోందని తెలుస్తోంది.
Instagram nudity protection feature : వినియోగదారులకు 'సైబ్ఫ్లాషింగ్' నుంచి మరింత రక్షణ కల్పించే దిశగా ఇన్స్టాగ్రామ్ కృషిచేస్తున్నట్టు నివేదికలు వచ్చాయి. ఈ మేరకు కొత్త ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 'న్యూడిటీ ప్రొటెక్షన్' ఫీచర్.. లైంగిక, అసభ్యకరమైన ఫొటోలు యూజర్ల ఇన్‌బాక్స్‌లోకి చేరకుండా ఉపయోగపడుతుందని సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
ఆన్లైన్లో అసభ్యకర, లైంగికపరమైన ఫొటోలను పంపించి, వేధించడాన్ని సైబర్ ఫ్లాషింగ్ అంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య కాలంలో ఇవి చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటననలు అడ్డుకునేందుకు ఇన్‌బాక్స్‌లోకి వచ్చే మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా ఫిల్టర్ చేసే దిశగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రయత్నిస్తోంది. న్యూడ్ ఫొటోలు, అసభ్యకర మెసేజ్‌ల నుంచి యూజర్లను రక్షించేందుకు మెషిన్ లర్నింగ్ సాయాన్ని ఇన్స్టాగ్రామ్ తీసుకుంటున్నట్టు నివేదిక పేర్కొంది.
Instagram new feature : ఇన్స్టాగ్రామ్ ఓనర్ సంస్థ 'మెటా' డెవలపర్ అలెస్సాండ్రో పౌజి.. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. "ఛాట్‌లో న్యూడిటీ నుంచి రక్షణ కల్పించే ఫీచర్‌పై ఇన్స్టాగ్రామ్ పనిచేస్తోంది. ఫొటోలను ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేయలేదు. కానీ న్యూడిటీతో కూడిన ఫొటోలను అడ్డుకుంటుంది," అని రాసుకొచ్చారు.
మెటా ప్రతినిధి కూడా ఈ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌పై స్పందించారు. “నిపుణులతో కలిసి.. ప్రజల గోప్యతకు భంగం కలగకుండా.. ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, ఇది అందుబాటులోకే వస్తే.. ఎనేబుల్, డిజేబుల్ చేసుకునే వెసులుబాటు యూజర్లకు ఇస్తాము,” స్పష్టం చేశారు.
Instagram latest features : ఇన్‌స్టాగ్రామ్‌లో పేరెంట్స్ కంట్రోల్ ఫీచర్.. ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీటితో పాటు.. ‘రీపోస్ట్’ ఫీచర్‌పైనా ఇన్స్టాగ్రామ్ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం