Dalit woman raped : దళిత మహిళపై సామూహిక అత్యాచారం- బీఫ్ తినిపించి!
Dalit woman raped : యూపీలో దారుణం జరిగింది. దళిత మహిళను ఇద్దరు రేప్ చేశారు. ఇందుకోసం మరో ముస్లిం మహిళ సాయం చేసింది!
Dalit woman raped : ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళను ఇద్దరు ముస్లింలు రేప్ చేశారు. ఇందుకు మరో మహిళ సాయం చేసినట్టు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ బరేలీ జిల్లాలో జరిగింది ఈ ఘటన. బాధితురాలికి ఓ ముస్లిం ఫ్రెండ్ ఉంది. ఆమె నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. దానిని తిరిగి ఇవ్వాలని చెప్పి.. ఆ ముస్లిం మహిళను కలవాలని ఫోన్ చేసింది.
ఈ నెల 2న వీరిద్దరు.. ఓ కేఫ్‌లో కలిశారు. అయితే.. ఆ ముస్లిం మహిళతో పాటు మరో ఇద్దరు ముస్లింలు కూడా కేఫ్‌కు వెళ్లారు. ఇక్కడే.. బాధితురాలని, ఆ ముస్లిం మహిళ ట్రిక్ చేసినట్టు తెలుస్తోంది. దళిత మహిళను వారు ముగ్గురు హోటల్‌కు తీసకెళ్లారు. ఆమె తిన్న ఫుడ్‌లో డ్రగ్స్ కలిపారు. ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత.. మహిళపై ఆ ఇద్దరు ముస్లింలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు బీఫ్ కూడా తినిపించినట్టు సమాచారం.
ఇదీ చూడండి:- Serial killer : వంట గదిలో 10 మృతదేహాలు.. ‘సీరియల్ కిల్లర్’ ఇంటిని చూసి పోలీసులే షాక్!
Uttar Pradesh rape case : నిందితుల పేర్లు షోయబ్, నజీమ్. షోయబ్.. స్థానికంగా బీ. ఫార్మా చదువుకుంటున్నాడు. షోయబ్‌కు బార్బర్‌గా పనిచేస్తున్నాడు. సామూహిక అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను.. నిందుతులు కెమెరాలో రికార్డ్ చేశారు. వాటితో మహిళను బెదిరించడం మొదలుపెట్టారు. రూ. 5లక్షలు ఇవ్వాలని, లేదా వీడియోను లీక్ చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను.. దళిత మహిళకు కాబోయే భర్తకు ఫార్వర్డ్ చేశాడు.
తీవ్ర దుఖంలో ఉన్న మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు ముస్లింలను అరెస్ట్ చేశారు. వారిద్దరు కశ్మీర్‌కి పారిపోతుండగా.. పట్టుకున్నామని వెల్లడించారు. వారికి సాయం చేసిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం