DA hike news : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 16శాతం పెరిగిన డీఏ!
Government employees DA hike news : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇచ్చింది రాజస్థాన్ ప్రభుత్వం. డీఏని 16శాతం పెంచుతున్నట్టు పేర్కొంది.
ఈ ఏడాది ద్వితీయార్థంలో పెరగాల్సిన డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ నెలలో కేంద్ర ఉద్యోగులకు డీఏపై శుభవార్త అందుతుందని అంచనాలు ఉన్నాయి. కాగా కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఇప్పటికే అలవెన్సులును ప్రకటించిడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా చేరింది. రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది రాజస్థాన్ ప్రభుత్వం.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
రాజస్థాన్ ప్రభుత్వం డియర్నెస్ అలొవెన్స్ని 16 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ఆరో వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం. పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్‌ని 9 శాతం పెంచింది.
'సుపరిపాలనకు అంకితమైన రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని ఐదు, ఆరో వేతన స్కేల్ కింద వరుసగా 16 శాతం, 9 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది,' అని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో తెలిపారు. ఈ నిర్ణయం ఫలితంగా ఐదో వేతన స్కేల్లో డియర్నెస్ అలవెన్స్ 42.7 శాతం నుంచి 44.3 శాతానికి, ఆరో ప్ స్కేల్లో 23 శాతం నుంచి 23.9 శాతానికి పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితేంటి?
మరోవైపు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ద్వితీయార్థంలో కరువు భత్యం పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలవెన్సులకు సంబంధించి అన్ని రకాల లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు అదనపు విడత డియర్నెస్ రిలీఫ్ విడుదలకు మార్చిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మూలవేతనం/పెన్షన్ రేటును 46 శాతం నుంచి మరో 4 శాతానికి పెంచారు. ఈ పెంపు తర్వాత ఉద్యోగుల అలవెన్స్ 50 శాతంగా ఉంది. దీంతో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు మరోసారి 4 శాతం పెంపు ఉంటుందని, అప్పుడు అలవెన్స్ 54 శాతం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని 27శాతం పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా?
ర్ణాటకవ్యాప్తంగా ఇప్పుడు 7వ పే కమిషన్‌పై తెగ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం 7వ పే కమిషన్ని అమలు చేస్తుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 27శాతం పెరుగుతాయా? అన్న ప్రశ్నలపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
7వ పే కమిషన్ సిఫార్సులపై కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం చర్చలు జరిపింది! సీఎం సిద్ధరామయ్య.. తన కేబినెట్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 27శాతం పెంచే విషయంపై ఆయన సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగిందట. చివరికి.. ఈ విషయంపై తుది నిర్ణయం సీఎం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని సమాచారం.
ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై పడే భారాన్ని ఓసారి లెక్కించాలని సీఎం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం