Cyclone Sitrang : దీపావళి నాడు ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!
Cyclone Sitrang live updates : పశ్చిమ్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు బ్యాడ్ న్యూస్! దీపావళి నాడు ఆయా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Sitrang live updates : సిత్రంగ్ తుపాను నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్ తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచనను ఇచ్చింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఈ నెల 24,25న అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ్ బెంగాల్ గ్యాంగ్టిక్ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్యంవైపు ప్రయాణించి.. మరో 12 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ నెల 25 తెల్లవారుజామున.. సిత్రంగ్ తుపాను బంగ్లాదేశ్ తీర ప్రాంతం టిన్కోనా ద్వీపం, సంద్వీప్ మధ్యలో తీరం దాటుతుందని పేర్కొంది. తీరం దాటే సమయంలో గంటకు 110కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు..
- సిత్రంగ్ తుపాను కారణంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.
- దివాళీ నాడు అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తర అసోంలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. దక్షిణ అసోం, తూర్పు మేఘాలయ, నాగాలండ్, మిజోరం, మణిపూర్, త్రిపురలో భారీ వర్షాలు పడతాయి. ఈ ప్రాంతాల్లో 25న మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
- Cyclone Sitrang ఈ నెల 26న.. అరుణాచల్‌ప్రదేశ్, ఈశాన్య అసోం, నాగాలాండ్‌లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.
- ఆదివారం, సోమవారం.. అండమాన్ అండ్ నికోబార్, ఒడిశాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 25న.. ఒడిశా తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు తప్పవు!
- పశ్చిమ్ బంగాల్లోని దక్షిణ- ఉత్తర పరగణాస్, తూర్పు- పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లో దివాళీ రోజున మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.
- 25న.. దక్షిణ- ఉత్తర పరగణాస్, నడియాలో వర్షాలు కురుస్తాయి.
ప్రభుత్వాలు సన్నద్ధం..
Cyclone Sitrang సిత్రంగ్ తుపాను నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. తగిన జాగ్రత్తలు చేపట్టాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశాయి. అదే సమయంలో.. మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని స్పష్టం చేశాయి.
సంబంధిత కథనం