Cyclone Mandous : దూసుకొస్తున్న మాండస్​ తుపాను.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!-cyclone mandous likely to form over bay of bengal these states to be impacted with heavy rains ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cyclone Mandous Likely To Form Over Bay Of Bengal. These States To Be Impacted With Heavy Rains

Cyclone Mandous : దూసుకొస్తున్న మాండస్​ తుపాను.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 06, 2022 12:00 PM IST

Cyclone Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

దూసుకొస్తున్న మాండస్​ తుపాను.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!
దూసుకొస్తున్న మాండస్​ తుపాను.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు!

Cyclone Mandous : బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్​పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దూసుకొస్తున్న మాండస్​ తుపాను..

ఈ తుపానుకు 'మాండస్​' అని పేరు పెట్టింది యూఏఈ. అరబిక్​ బాషలో మాండస్​ అంటే నిధుల పెట్టె! ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండో తుపాను ఈ మాండస్​. అక్టోబర్​లో సిత్రంగ్​ తుపాను.. బంగ్లాదేశ్​లో బీభత్సం సృష్టించింది.

Cyclone Mandous live updates : ఇక ఇప్పుడు.. మాండస్​ తుపాను ఈ నెల 8న తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్​ 5న.. దక్షిణ అండమాన్​ సముద్రం పరిస ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అక్కడి నుంచి వాయువ్య- ఉత్తరంవైపు అది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం నాటికి అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారొచ్చు. ఆ తరువాత అక్కడి నుంచి వాయువ్య- ఉత్తరంవైపు ప్రయాణించి తుపానుగా మారవచ్చు. ఈ నెల 8 ఉదయం.. ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి మధ్యలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది.

మాండస్​ తుపాను వల్ల తమిళనాడు ఉత్తర- తీర ప్రాంతాలు, పుదుచ్చేరి, కరైకల్​లో ఈ నెల 7 అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత..9 వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.

Cyclone Mandous in Tamil Nadu : ఈ నెల 7-9 మధ్య తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్​ పేర్కొంది.

"తుపాను ఏర్పడుతుంది. కానీ తీరాన్ని తాకే ముందు అది బలహీన పడిపోవచ్చు. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి," అని స్కైమెట్​కు చెందిన మహశ్​ పలావత్​ తెలిపారు.

తుపానుకు రాష్ట్రలు సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధంగా ఉంచింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టింది.

IPL_Entry_Point