CUET-UG admit card: సీయూఈటీ యూజీ జూన్ 15- 17 తేదీల అడ్మిట్ కార్డ్స్ విడుదల-cuetug admit card for june 15 17 exams out on cuetsamarthacin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet-ug Admit Card: సీయూఈటీ యూజీ జూన్ 15- 17 తేదీల అడ్మిట్ కార్డ్స్ విడుదల

CUET-UG admit card: సీయూఈటీ యూజీ జూన్ 15- 17 తేదీల అడ్మిట్ కార్డ్స్ విడుదల

HT Telugu Desk HT Telugu

CUET-UG admit card: 2023 జూన్ 15 నుంచి జూన్ 17 వరకు జరిగే సీయూఈటీ యూజీ (CUET-UG) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేశారు. విద్యార్థులు cuet.samarth.ac.in వెబ్ సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

CUET-UG admit card: దేశవ్యాప్తంగా ప్రముఖ వర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం సీయూఈటీ యూజీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో.. జూన్ 15 నుంచి జూన్ 17 వరకు పరీక్షలు ఉన్నవారి అడ్మిట్ కార్డ్స్ cuet.samarth.ac.in వెబ్ సైట్ లో సిద్ధంగా ఉన్నాయి.

అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ తో..

విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లను ఎంటర్ చేసి తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి జూన్ 14 వరకు జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్, సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను ఇప్పటికే జారీ చేశారు. జూన్ 15, జూన్ 16, జూన్ 17 తేదీల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ప్రస్తుతం cuet.samarth.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. జూన్ 17 తరువాత పరీక్షలు ఉన్న విద్యార్థుల అడ్మిట్ కార్డ్స్, సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను త్వరలో cuet.samarth.ac.in వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామని ఎన్టీఏ వెల్లడించింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.