CUET PG 2023: సీయూఈటీ పీజీ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ సిద్ధం; డౌన్ లోడ్ చేసుకోండిలా..-cuet pg 2023 exam city intimation slip out for june 9 11 download link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cuet Pg 2023: Exam City Intimation Slip Out For June 9-11, Download Link Here

CUET PG 2023: సీయూఈటీ పీజీ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ సిద్ధం; డౌన్ లోడ్ చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 01:37 PM IST

CUET PG 2023: కంబైన్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ (CUET PG 2023) పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in. లో సిద్ధంగా ఉన్నాయి. అభ్యర్థులు కింది స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CUET PG 2023: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన సీయూఈటీ పీజీ 2023 (CUET PG 2023) సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను ఎన్టీఏ (NTA) సిద్ధం చేసింది. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

జూన్ 9 నుంచి జూన్ 11 వరకు..

జూన్ 9 వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు జరిగే సీయూఈటీ పీజీ 2023 (CUET PG 2023) పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. ఆయా తేదీల్లో, అంటే జూన్ 9, జూన్ 10, జూన్ 11 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in. నుంచి ఆ స్లిప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేయడం ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. CUET PG పరీక్షలకు సుమారు 1.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ లో ఏముంటుంది.?

సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ లో అభ్యర్థికి రాస్తున్న పరీక్ష జరిగే నగరం, పరీక్ష జరిగే తేదీ, ఎగ్జామ్ షిప్ట్, సబ్జెక్ట్.. తదితర వివరాలుంటాయి. అభ్యర్థులు కింది స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • సీయూఈటీ అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in. ను లేదా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ nta.ac.in. ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న CUET PG 2023 exam city intimation slip లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • స్క్రీన్ పై అభ్యర్థి సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది.
  • ఆ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
  • జూన్ 9, జూన్ 10, జూన్ 11 తేదీల్లో జరిగే సీయూఈటీ పీజీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ లను త్వరలో cuet.nta.nic.in., nta.ac.in. వెబ్ సైట్ లలో అప్ లోడ్ చేయనున్నారు.
  • Official Notice Here

IPL_Entry_Point