Congress pledges to scrap Agnipath : 'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'-congress pledges to scrap agnipath reintroduce old armed services recruitment scheme ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress Pledges To Scrap Agnipath : 'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

Congress pledges to scrap Agnipath : 'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

Sharath Chitturi HT Telugu

Congress on Agnipath scheme : లోక్​సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఆర్మీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ.. అగ్నిపథ్​ని రద్దు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. దాని స్థానంలో పాత ప్రక్రియను తీసుకొస్తామని వెల్లడించింది.

'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

Agnipath scheme Congress : 2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వస్తే.. వివాదాస్పద 'అగ్నిపథ్​' పథకాన్ని తొలగిస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. ఆర్మీ సేవల రిక్రూట్​మెంట్​ కోసం.. అగ్నిపథ్​ స్థానంలో పాత సిస్టెమ్​ని తిరిగి ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. అగ్నిపథ్​పై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్​ ఈ ప్రకటన చేసింది.

ఆర్మీ రిక్రూట్​మెంట్​ కోసం కేంద్రం.. 2022లో ఈ అగ్నిపథ్​ స్కీమ్​ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. సర్వీస్​ టెన్యూర్ (4ఏళ్ల కాంట్రాక్ట్​)​ తగ్గిపోతుంది, బెనిఫిట్స్​ కూడా తక్కువగానే అందుతాయి. ఈ స్కీమ్​ చుట్టూ చాలా వివాదం నడిచింది. చాలా చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా.. ఈ విషయాలను ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించారు మల్లిఖార్జున ఖర్గే. 2లక్షల మంది పురుషులు, మహిళలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఆర్మీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియతో యువత భవిష్యత్తు అంధకారంలోకి జారుకుందని అన్నారు.

Agnipath scheme BJP : ఖర్గే లేఖ రాసిన వార్త బయటకు వచ్చిన కొన్ని గంటలకు.. కాంగ్రెస్​ నేతలు సచిన్​ పైలట్​, దీపక్​ హుడాలు మీడియా సమావేశం నిర్వహించారు.

"డిఫెన్స్​ పరంగా మన ఖర్చులు పెరుగుతున్నాయి. డిఫెన్స్​ ఎగుమతుల ద్వారా మన సంపద పెరుగుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. దేశీయంగా మేన్యుఫ్యాక్చరింగ్​ చేసి మనం ఇండిపెండెంట్​గా అవుతున్నామని వార్తలు వస్తున్నాయి. మన రక్షణ శాఖ ఇంత ఆదాయం జనరేట్​ చేస్తూ, మన సామర్థ్యం భారీ స్థాయిలో పెరుగుతుంటే.. జాబ్స్​, రిక్రూట్​మెంట్​, వీర సైనికుల కుటుంబాల కోసం వనరులు కేటాయించాలి కదా," అని సచిన్​ పైలట్​ అన్నారు.

"బీజేపీ ప్రభుత్వం..సైన్యాన్ని బలహీపరుస్తోంది. కాస్ట్​ కటింగ్​ అంటూ.. రాజకీయాలు చేస్తోంది. అందుకే అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. జీ-20 సదస్సుపై ప్రభుత్వం రూ. 4,100 కోట్లు వెచ్చించింది. ప్రధాని విమానంపై రూ. 4,800 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​పై రూ. 20వేలు, యాడ్స్​పై మరో రూ. 6500 కోట్లు వెచ్చించింది. కానీ అత్యంత కీలకమైన భారత దేశ భద్రత, సైనికుల రిక్రూట్​మెంట్​లో డబ్బులు పొదుపు చేయాలని చూస్తోంది," అని పైలట్​ మండిపడ్డారు.

Army recruitment process Agnipath scheme : "అగ్నిపథ్​ స్కీమ్​ తీసుకురావాలని.. ఆర్మీ, సైనికులు, యువత, రాజకీయ పార్టీల నుంచి డిమాండే లేదు. అగ్నివీర్​ వచ్చిన తర్వాత.. ఆర్మీ రిక్రూట్​మెంట్​ సగటు.. యేటా 60,000-65,000 నుంచి 45వేలకు పడిపోయింది. ఇదే కొనసాగితే.. 10ఏళ్లల్లో.. 1.4 మిలియన్​ శక్తి ఉన్న మన సైన్యం.. 8,00,000కు పడిపోతుంది. 'వన్​ నేషన్​, వన్​ ర్యాంక్​, వన్​ పెన్షన్​' అంటూ ఎన్నికల్లో చేసిన హామీని నెరవేర్చకుండా.. ఈ ప్రభుత్వం 'నో ర్యాంక్​, నో పెన్షన్​ సిస్టెమ్​'ని తీసుకొచ్చింది," అని హుడా ఆరోపించారు.

'సైనికుడు నాలుగేళ్ల తర్వాత ఇంటికి వెళతాడు. అతనికి పెన్షన్​ కూడా ఉండదు! ఏం చేస్తాడు? ఎక్కడికి వెళతాడు? బీజేపీ నేత విజయ్​వర్ఘియ మాత్రం.. నాలుగేళ్ల తర్వాత.. తమ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు ఇస్తామని అంటున్నారు,' అని అసహనం వ్యక్తం చేశారు హుడా.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.