Live-In Relationship | అక్కడ కథ వేరే ఉంటది.. పెళ్లికి ముందే శృంగారం.. ఓకే అయితేనే వివాహం..-chhattisgarh muria tribe culture before wedding they have option to choose sexsual partner ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Chhattisgarh Muria Tribe Culture Before Wedding They Have Option To Choose Sexsual Partner

Live-In Relationship | అక్కడ కథ వేరే ఉంటది.. పెళ్లికి ముందే శృంగారం.. ఓకే అయితేనే వివాహం..

HT Telugu Desk HT Telugu
Apr 22, 2022 09:45 PM IST

పెళ్లికి ముందు లీవ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. మనకు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది. కానీ ఇండియాలోని.. కొన్ని ప్రాంతాల్లో.. ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే అదే వారి ఆచారం కూడా. ఇంతకీ ఎక్కడ ఆ ప్రదేశం?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లికి ముందు సహజీవనం చేసే ప్రాంతం గురించి తెలుసుకునే ముందు ఓ విషయం చెప్పుకోవాలి. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్.. వన్ పార్ట్ ఉమన్  నవల రాశారు. అందులో.. సంతానం లేని స్త్రీ ఒక అపరిచితుడితో కలిసి వివాహ నిబంధనలను ఉల్లంఘించే పండుగ గురించి ఉంటుంది. అలాంటి కలయికలో ఒక బిడ్డ పుడితే, భగవంతుడి బహుమతిగా అందరూ ఆలింగనం చేసుకుంటారు. కానీ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న జంటకు, అలాంటి పని చేయడం చాలా కష్టం.

ట్రెండింగ్ వార్తలు

ఈ పుస్తకం అప్పట్లో వివాదమే సృష్టించింది. మురుగన్ ఈ పండుగను ఊహతో సృష్టించలేదు. తమిళనాడులోని తిరుచెంగోడ్ కొండ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 50 ఏళ్ల క్రితం ఇలాంటి పండుగ ఉండేదని ఆయన గుర్తించారు. ఈ పండుగ ద్వారా పుట్టిన పిల్లలను కూడా చూశారు. అలా పుట్టిన వారిని.. అర్ధనారి (సగం స్త్రీ) లేదా సామి పిళ్లై (దేవుడు ఇచ్చిన బిడ్డ) అని పిలుస్తారు. ఇటువంటి అనేక పద్ధతులు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇలాంటివి అంగీకరించడం కష్టం.

పై విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. అలాంటి ఆచారమే ఒకటి ఇప్పటికీ కొనసాగుతోంది. అది ఎక్కడో కాదు. మన భారతదేశంలోనే. ఈ సంప్రదాయాన్ని వారు పాటిస్తున్నట్టు తెలుస్తోంది. మన పక్కనే ఉన్న.. చత్తీస్‌ఘడ్‌లో ఈ కల్చర్ ఉంది.  అక్కడ ప్రాచీన ఆదివాసీ తెగలు ఉన్నాయి. బస్తర్ జిల్లాలోని ఇంద్రావతి నది దగ్గరలో ఈ మారియా తెగ ఉంటుంది. సాధారణంగా ఇక్కడకు బయటి వ్యక్తులు వెళ్లరు. వాళ్లు పండించే.. పంటనే ఆహారంగా తీసుకుంటారు.

వివాహానికి ముందు పవిత్రతకు వీళ్లు ప్రాధాన్యత ఇవ్వరు. లైంగిక సౌకర్యానికి విలువనిస్తుంది ఈ తెగ. బ్రిటీష్ పౌర సేవకుడు విల్ఫ్రిడ్ గ్రిగ్సన్ 1938లో ప్రచురించిన ది మరియా గోండ్స్ ఆఫ్ బస్తర్ లో అతను ఒకసారి హాజరైన వివాహాన్ని డాక్యుమెంట్ చేశాడు. వారి లైంగిక అనుకూలతను తనిఖీ చేయడానికి ఈ జంట చాలాసార్లు సెక్స్ చేశారని అతను రాశాడు. ఒకరికొకరు సంతృప్తి చెందినప్పుడే పెళ్లి చేసుకున్నారని తెలిపాడు.

మనలాగా.. పెద్దలకు నచ్చిన పెళ్లే జరగాలని ఆ తెగలో ఉండదు. నచ్చిన భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని గోటుల్ అని పిలుస్తారట. పెళ్లికి ముందు తమ భాగస్వామి లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు నచ్చినవారితో ఏకాంతంగా గడపొచ్చు.

చెక్కతో చేసిన గోడలతో ఒక సాధారణ గుడిసెలో అబ్బాయి, అమ్మాయి ఏకాంతంగా గడపొచ్చు. దీని వెనక ఉన్న ఆలోచన ఏమిటంటే.. తెగకు చెందిన యువకులకు వారి లైంగికతను అన్వేషించడానికి.., కలిసి ఉండే అనుభూతిని పెంపొందించడానికి వాతావరణాన్ని అందించడం. అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారం చేయోచ్చు. గరిష్టంగా ఏడు రోజుల వ్యవధి తర్వాత భాగస్వాములను మార్చేందుకు అవకాశం ఇస్తారు.

గుడిసెలోకి వెళ్లే ముందు.. ఆ ఇళ్లలో చాలా పెద్ద వేడుక నిర్వహిస్తారు. వారం రోజులపాటు గడిపాక.. ఒకవేళ నచ్చితే.. ఆమె తలలో అబ్బాయి పువ్వు పెట్టాలి. ఇద్దరూ ఒకరికొకకరు నచ్చకుంటే.. మరొకరిని సెలక్ట్ చేసుకోవాలి. మళ్లీ వారం రోజులు ఉన్న తర్వాత.. సెమ్ నచ్చితేనే పెళ్లి. మరో విషయం ఏంటంటే.. మారియా తెగలో దాదాపు లైంగిక నేరాలు లేవు.

IPL_Entry_Point