Chandrayaan-3 : చంద్రయాన్ - 3 ఎఫెక్ట్; పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్, చంద్రయాన్ అని పేర్లు పెడ్తున్న తల్లిదండ్రులు-chandrayaan3 parents name kids vikram pragyan to celebrate chandrayaan 3 success ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3 : చంద్రయాన్ - 3 ఎఫెక్ట్; పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్, చంద్రయాన్ అని పేర్లు పెడ్తున్న తల్లిదండ్రులు

Chandrayaan-3 : చంద్రయాన్ - 3 ఎఫెక్ట్; పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్, చంద్రయాన్ అని పేర్లు పెడ్తున్న తల్లిదండ్రులు

HT Telugu Desk HT Telugu
Aug 31, 2023 10:49 AM IST

Chandrayaan-3: దేశ ప్రజల్లో చంద్రయాన్ 3 విజయం ఎంతగా ప్రభావం చూపిందంటే.. చాలా మంది తల్లిదండ్రులు తమ నవజాత శిశువులకు చంద్రయాన్, విక్రమ్, ప్రజ్ఞాన్ అని పేర్లు పెడుతున్నారు. కొందరైతే, తమ పిల్లలకు గతంలో పెట్టిన పేరును కూడా మార్చేసి కొత్తగా విక్రమ్, ప్రజ్ఞాన్ అనే పేర్లు పెడ్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

Chandrayaan-3: దేశ ప్రజల్లో చంద్రయాన్ 3 విజయం ఎంతగా ప్రభావం చూపిందంటే.. చాలా మంది తల్లిదండ్రులు తమ నవజాత శిశువులకు చంద్రయాన్, విక్రమ్, ప్రజ్ఞాన్ అని పేర్లు పెడుతున్నారు. కొందరైతే, తమ పిల్లలకు గతంలో పెట్టిన పేరును కూడా మార్చేసి కొత్తగా విక్రమ్, ప్రజ్ఞాన్ అనే పేర్లు పెడ్తున్నారు.

కర్నాటకలో..

కర్నాటకలో రెండు జంటలు తమ నవజాత శిశువులకు విక్రమ్, ప్రజ్ఞాన్ అనే పేర్లను పెట్టాయి. కర్నాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఈ జంటలు చంద్రయాన్ 3 విజయాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాయి. నిజానికి చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందే వారికి పిల్లలు పుట్టారు. బాలప్ప, నాగమ్మ దంపతులకు జులై 28న బాబు జన్మించాడు. ఆ బాలుడికి ముందు నిర్ణయించిన పేరుకు బదులుగా.. చంద్రయాన్ విజయం అనంతరం విక్రమ్ అనే పేరును ఖాయం చేశారు. అలాగే, నింజప్ప, శివమ్మ దంపతులకు ఆగస్ట్ 14న, చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు 10 రోజుల ముందు మగ శిశువు న్మించాడు. అతడి పేరును ప్రజ్ఞాన్ అని పెట్టారు. ఈ ఇద్దరు పిల్లల నామకరణోత్సవం ఆగస్ట్ 24 న, చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన మర్నాడు ఘనంగా నిర్వహించారు.

ఒడిశాలో కూడా..

ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో ఆగస్ట్ నెలలో జన్మించిన చాలా మంది శిశువులకు వారి తల్లిదండ్రులు చంద్రయాన్ అనే పేరును పెట్టారు. కేంద్రపార జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం జన్మించిన నలుగురు పిల్లలకు వారి తల్లిదండ్రులు చంద్రయాన్ అనే పేరునే పెట్టారు. వారిలో ముగ్గురు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ‘మా బాబు చంద్రయాన్ 3 చంద్రుడిపై ల్యాండ్ అయిన సమయంలోనే జన్మించాడు. అందువల్ల మా బాబు పేరును చంద్రయాన్ అని పెట్టాం’ అని ప్రవత్ మాలిక్ తెలిపారు. చంద్రయాన్ పేరు చాలా స్టైలిష్ గా ఉందని సంతోషంగా తెలిపారు.