Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయాణంలో అత్యంత కీలక ఘట్టం ఈ రోజే..; చంద్రుడికి మరింత సమీపంలోకి..-chandrayaan3 isros vikram lander set to begin separate journey today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయాణంలో అత్యంత కీలక ఘట్టం ఈ రోజే..; చంద్రుడికి మరింత సమీపంలోకి..

Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయాణంలో అత్యంత కీలక ఘట్టం ఈ రోజే..; చంద్రుడికి మరింత సమీపంలోకి..

HT Telugu Desk HT Telugu
Aug 17, 2023 12:34 PM IST

Chandrayaan-3: భారత ప్రభుత్వం ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడు చోటు చేసుకోనుంది. చంద్రుడికి సమీప కక్షలోకి చేరిన చంద్రయాన్ 3 లోని ప్రొఫెషన్ మోడ్యుల్ని లాండర్ మోడ్యుల్ని వేరు చేయాల్సి ఉంటుంది. ఇది చంద్ర యాన్ ప్రయోగంలో మరో అత్యంత కీలక ఘట్టం.

చంద్రయాన్ 3 ప్రయాణం
చంద్రయాన్ 3 ప్రయాణం

Chandrayaan-3: భారత ప్రభుత్వం ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడు చోటు చేసుకోనుంది. చంద్రుడికి సమీప కక్షలోకి చేరిన చంద్రయాన్ 3 లోని ప్రొఫెషన్ మోడ్యుల్ని లాండర్ మోడ్యుల్ని వేరు చేయాల్సి ఉంటుంది. ఇది చంద్ర యాన్ ప్రయోగంలో మరో అత్యంత కీలక ఘట్టం.

వేరువేరు ప్రయాణాలు

ఆగస్టు 16వ తేదీన అత్యంత సమీపంలోని 153 x163 కిలోమీటర్ల కక్ష్య లోకి చంద్రయాన్ 3 వెళ్ళింది. ఇప్పుడు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఉన్నల్యాండర్ మాడ్యూల్ విడివడి ప్రత్యేక ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 17న ఇస్రో చేపట్టనుంది. ఆ తరువాత, ఈ ల్యాండర్ మాడ్యూల్ ను చంద్రుడికి సమీపంలోని దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేర్చే కార్యక్రమాన్ని ఇస్రో చేపడ్తుంది. చంద్రుడికి అత్యంత సమీపంగా 30 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 100 కిలోమీటర్లు ఉన్న దీర్ఘ వృత్తాకారక్షలో చంద్రయాన్ 3 చేరాల్సి ఉంది. ఆ తరువాత క్రమంగా లాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గిస్తూ నిట్ట నిలువుగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై దింపాల్సి ఉంటుంది. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 చంద్రుడు పై కాలు మోపుతుంది.

క్లిష్టమైన ఘట్టం ముందుంది..

చంద్రునిపై దిగేముందు లాండర్ వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ నిట్ట నిలువునా చంద్రుడు ఉపరితలంపై దింపడమనే ప్రక్రియ చంద్రయాన్ 3 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ. దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న లాండర్ మోడ్యుల్ని వేగాన్ని తగ్గిస్తూ, గమనాన్ని మారుస్తూ నిట్ట నిలువుగా చంద్రుడి పైకి దింపే దశ అత్యంత క్లిష్టమైనదిగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 భారత ప్రభుత్వం చంద్రుడిపై ప్రయోగాల కోసం చేపట్టిన మూడవ ప్రయోగం. చంద్రయాన్ 2 చివరి దశలో, చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆ ప్రయోగం పాక్షికంగానే విజయవంతమైంది. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులై 14న ఇస్రో చేపట్టింది.