Free medical treatment for accident victims : రోడ్డు ప్రమాద బాధితులకు ఇక నుంచి ఉచిత వైద్యం!
Free medical treatment for accident victims : రోడ్డు ప్రమాద బాధితులకు ఇక నుంచి ఉచిత వైద్యం అందనుంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది.
Free medical treatment for accident victims : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇకపై ఉచిత వైద్యం అందనుంది! ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రానున్న 3,4 నెలల్లో ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం..!
వాస్తవానికి.. ఇలా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా వైద్యం అందించడం అనేది.. మోటార్ వెహికిల్ యాక్ట్ 2019లో ఒక భాగంగా ఉంది. కానీ ఇంతవరకు దీనిని అమలు చేయలేదు. రానున్న రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని మంత్రిత్వశాఖ చెబుతోంది.
"ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికంగా ఉన్న దేశం ఇండియా. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50శాతం మేర తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాము. ఎడ్జ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ కేర్ వంటి 5ఈ విధానాన్ని అనుసరిస్తున్నాము. ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత, క్యాష్‌లెస్ వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాము," అని కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వశాఖ సెక్రటరీ అనురాగ్ జైన్ తెలిపారు.
Union Ministry of Road Transport & Highways : రోడ్డు ప్రమాదాలపై గత కొంతకాలంగా ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రోడ్డు డిజైన్‌లో దీనికి పెద్ద పీట వేస్తోంది. అంతేకాకుండా.. ఈ-డార్ అనే ప్రాజెక్ట్ చేపట్టి.. రోడ్డు ప్రమాదాల కోసం ఒక డేటాబేస్‌ని రూపొందించింది. ఇందులో.. ప్రమాదాలకు సంబంధించిన పూర్తి రిపోర్టుతో పాటు రోడ్లకు చెందిన ఎనాలసిస్ కూడా ఉంటుంది.
రోడ్లపై ఇదీ పరిస్థితి..!
వివిధ రాష్ట్రాల్లోని పోలీసు విభాగాల ప్రకారం.. 2022లో ఇండియాలో 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో 1,68,491 మంది మరణించారు. 4,43,366 మంది గాయపడ్డారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగం అని రోడ్డు రవాణా- రహదారులశాఖ పేర్కొంది. రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్, ట్రాఫిక్ లైట్స్‌ని విస్మరించడం, మద్యం సేవించి వాహనాన్ని నడపడం వంటివి ప్రమాదాలకు ఇంకొన్ని కారణాలని స్పష్టం చేసింది.
Free treatment for accident victims ': కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి భారీ ఆర్థిక సాయం లభించినట్టే అవుతుంది.
సంబంధిత కథనం