CTET 2022 schedule: సీటెట్ షెడ్యూలు విడుదల.. పరీక్షల తేదీలు ఇవే-cbse ctet 2022 schedule released exam from december 28 to february 7 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ctet 2022 Schedule: సీటెట్ షెడ్యూలు విడుదల.. పరీక్షల తేదీలు ఇవే

CTET 2022 schedule: సీటెట్ షెడ్యూలు విడుదల.. పరీక్షల తేదీలు ఇవే

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 11:06 AM IST

CBSE CTET 2022 schedule: సీటెట్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

CBSE CTET 2022 schedule released, exam from December 28 to February 7
CBSE CTET 2022 schedule released, exam from December 28 to February 7 (HT file)

సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్ 2022) షెడ్యూలును సీబీఎస్ఈ నేడు విడుదల చేసింది. సీటెట్ కంప్యూటర్ బేస్డ్ మోడ్‌ (ఆన్‌లైన్)లో నేటి నుంచి ఫిబ్రవరి 7, 2023 వరకు నిర్వహిస్తారు. 

సీటెట్ పరీక్ష డిసెంబరు 28, 29, జనవరి 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 23, 24, 25, 27, 28, 29, 30 తేదీల్లో ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 1, 2, 3, 4, 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు సీటెట్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి వారి పరీక్షల తేదీలను, ఆన్‌లైన్ పరీక్షకు కేటాయించిన నగరాన్ని సరిచూసుకోవచ్చు.

సీబీఎస్ఈ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎగ్జామినేషన్ సెంటర్, టైమ్ అడ్మిట్ కార్డుపై ఉంటుంది. ఈ కార్డును సీటెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి 2 రోజుల ముందు ఈ అడ్మిట్ కార్డు లభ్యమవుతుంది. ఎగ్జామినేషన్ సిటీ, సెంటర్, తేదీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని సీబీఎస్‌ఈ తెలిపింది.

డిసెంబరు 28, డిసెంబరు 29 పరీక్షలు రాసే అభ్యర్తులకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ప్రస్తుతం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్‌ఈ సీటెట్ వెబ్‌సైట్ పరిశీలించవచ్చు.

సీబీఎస్ఈ అధికారిక ప్రకటన ఇదే..

IPL_Entry_Point

టాపిక్