CAT 2024 registration : క్యాట్ రిజిస్ట్రేషన్‌కి ఈరోజే లాస్ట్ డేట్- పూర్తి వివరాలు..
CAT 2024 registration : క్యాట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్ లింక్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
క్యాట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నేటితో (సెప్టెంబర్ 13) ముగియనుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సు చేసేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు iimcat.ac.in లో క్యాట్ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 2024 క్యాట్ పరీక్షను ఐఐఎం కోల్‌కతా నిర్వహిస్తోంది.
నవంబర్ 5న అడ్మిట్ కార్డులను విడుదల చేసి.. నవంబర్ 24న ప్రవేశ పరీక్షను ఐఐఎం కోల్‌కతా నిర్వహించనుంది. ఫలితాలను 2025 జనవరి రెండో వారంలో ప్రకటిస్తారని తెలుస్తోంది. కరెక్ట్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
క్యాట్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్యాట్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన సీజీపీఏతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీస మార్కులు 45 శాతం ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు, ఇప్పటికే డిగ్రీ పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదీ చూడండి:- CSIR UGC NET Results: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 రిజల్ట్స్ వచ్చేశాయి.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
క్యాట్ 2024 దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,250. మిగతా వారికి దరఖాస్తు ఫీజు రూ.2,500.
దేశవ్యాప్తంగా 170 నగరాల్లో క్యాట్ 2024 పరీక్ష జరగనుంది. దరఖాస్తు ఫారంలో అభ్యర్థి తమకు నచ్చిన ఐదు పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చు.
క్యాట్ 2024 పరీక్ష పేపర్లో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ), డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ/క్వాంట్స్) అనే మూడు విభాగాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు, ప్రతి విభాగానికి సమాధానాలు రాయడానికి అభ్యర్థులకు 40 నిమిషాలు కేటాయిస్తారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫెలో/డాక్టరేట్ స్థాయి బిజినెస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షే ఈ క్యాట్. ఐఐఎంలతో పాటు పలు ఇతర సంస్థలు కూడా తమ అడ్మిషన్ ప్రక్రియల్లో ఈ పరీక్షను ఉపయోగించుకుంటాయి.
క్యాట్‌లో అర్హత సాధించినంత మాత్రాన ఐఐఎంల్లో ప్రవేశానికి గ్యారంటీ ఉండదని గుర్తు పెట్టుకోవాలి! గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అందులో పాసైతేనే సీటు లభిస్తుంది.
ప్రతి ఐఐఎం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ లెటర్లను పంపుతుంది. కొన్ని సంస్థల ఎంపిక ప్రక్రియలో రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ (వాట్) కూడా ఉండవచ్చు.
అడ్మిషన్ల ప్రక్రియలో వివిధ దశల్లో అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ర్యాంకింగ్ లో అభ్యర్థుల గత అకడమిక్ పనితీరు, సంబంధిత పని అనుభవం, అకాడమిక్ వైవిధ్యం తదితర అంశాలను ఐఐఎంలు అదనంగా ఉపయోగించుకోవచ్చు.
సంబంధిత కథనం