Britain PM Rishi Sunak: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. గతంలో ఓసారి లాక్‍డౌన్ రూల్స్ ఉల్లఘించారు, మరోసారి సీటు బెల్టు పెట్టుకోకుండా కారులో కనిపించారు. ఇప్పుడు తాజా తన పెంపుడు కుక్క (Rishi Sunak’s Pet) వల్ల పోలీసుతో నిబంధనలు చెప్పించుకున్నారు.
Britain PM Rishi Sunak: లండన్‍లోని హైడర్ పార్కు(Hyder Park)కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. తన కుటుంబంతో పాటు నోవా అనే తన లాబ్రేడర్ (Nova the Labrador) జాతి పెంపుడు శునకాన్ని తీసుకెళ్లారు. అక్కడ వాకింగ్ చేశారు. అయితే ఆ పార్కులో పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదలకూడదు. యజమానులు నిరంతరం వాటిని పట్టుకొని కంట్రోల్ (లీడ్) చేస్తుండాలి. అక్కడి వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ఈ రూల్ విధించారు. ఈ నిబంధన రాసి ఉన్న బోర్డు కూడా ఆ పార్కులో ఉంది.
Britain PM Rishi Sunak: అయితే, ప్రధాని రిషికి చెందిన నోవా అనే పెంపుడు శునకం ఆ పార్కులో స్వేచ్ఛగా తిరిగింది. దాన్ని ఎవరూ లీడ్ చేయడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో టిక్‍టాక్‍లో ఒకటి పోస్ట్ అయింది. శునకం స్వేచ్ఛగా తీరుగుతుండటంతో ఓ మెట్రోపాలిటన్ పోలీస్ వచ్చి.. శునకాన్ని పట్టుకోవాలని రిషితో పాటు ఆయన భార్యకు సూచించారు. పార్కు నిబంధనను గుర్తు చేశారు.
Britain PM Rishi Sunak: “ఓ ఆఫీసర్ ఆ సందర్భంలో అక్కడ ఉన్నారు. ఆమెతో మాట్లాడి నిబంధనలను గుర్తు చేశారు” అని పోలీసులు ఓ స్టేట్‍మెంట్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆ శునకాన్ని వారు లీడ్ చేశారని పేర్కొన్నారు. రిషి సునాక్ భార్య ఆక్షత మూర్తిని రిఫర్ చేస్తూ ఈ ప్రకటన చేశారు మెట్రోపాలిటన్ పోలీసులు. అయితే ప్రధాని సునాక్ కూడా అప్పుడు అక్షత పక్కనే ఉన్నారు. ఈ విషయంపై ప్రధాని అధికార ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.
2020లో బొరిస్ జాన్సర్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునాక్.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన పార్టీకి హాజరై జరిమానా కట్టారు. అప్పుడు బోరిస్ జాన్సన్‍కు కూడా జరిమానా పడింది. ఫైన్ కట్టిన తొలి ప్రధానిగా జాన్సన్ నిలిచారు. గతేడాది అక్టోబర్‌లో ప్రధాని అయ్యారు భారత సంతతి వ్యక్తి అయిన సునాక్. అయితే ఈ ఏడాది జనవరిలో కారులో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా రిషి సునాక్ మరోసారి జరిమానా కట్టాల్సి వచ్చింది.
సంబంధిత కథనం