ATF price : భారీగా తగ్గిన విమాన ఇంధన ధరలు.. టికెట్ రేట్లు కూడా..!
ATF price : దేశీయంగా విమాన ఇంధన ధరలను తగ్గించాయి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు. ఈ విషయాన్ని శనివారం ప్రకటించాయి.
ATF price : విమానయాన సంస్థలకు ఉపశమనం! విమాన ఇంధన(ఏటీఎఫ్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు భారీగా తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తుండటంతో శనివారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా ఏటీఎఫ్ ధరలు 2.2శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం.. ఏటీఎఫ్ ధరలు కిలోలీటరుకు రూ. 3,084.94 తగ్గి.. రూ. 1,38,147.93కి చేరాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర రూ. 1,38,147.95(కిలోలీటరకు)గా ఉంది. ముంబైలో ఆ ధర రూ. 1,37,095.74కు చేరింది. రాష్ట్రాలు, ప్రాంతాల బట్టి ఏటీఎఫ్ ధరలను విభజిస్తారు.
ఈ ఏడాదిలో ఏటీఎఫ్ ధరలను తగ్గించడం ఇది రెండోసారి. కాగా.. ఈ ఏడాది అనేకమార్లు ఏటీఎఫ్ ధరలను పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. జూన్లో ధరలు రూ. 1,41,232.87(కిలోలీటరుకు) వద్ద ఆల్ టైమ్ హైని తాకింది.
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా.. ప్రతి నెల 1, 16న ఏటీఎఫ్ ధరలను సవరిస్తారు. జులై 1న ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఏటీఎఫ్ ధరలు తగ్గడంతో.. విమాన టికెట్ల ధరలు కూడా తగ్గుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్