Rivaba Jadeja to be Gujarat minister: రవీంద్ర జడేజా భార్యకు మంత్రి పదవి..!-bhupendra patel to continue as chief minister of gujarat oath on monday
Telugu News  /  National International  /  Bhupendra Patel To Continue As Chief Minister Of Gujarat, Oath On Monday
 క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ కొత్త ఎమ్మెల్యే రివాబా జడేజా
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ కొత్త ఎమ్మెల్యే రివాబా జడేజా

Rivaba Jadeja to be Gujarat minister: రవీంద్ర జడేజా భార్యకు మంత్రి పదవి..!

10 December 2022, 16:52 ISTHT Telugu Desk
10 December 2022, 16:52 IST

Bhupendra to continue as CM of Gujarat: గుజరాత్ లో ఘన విజయం సాధించిన బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నే కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని బీజేపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది.

Patidar community: గుజరాత్ లో పటీదార్ వర్గం అత్యంత కీలకమైన సామాజిక వర్గం. గత ఎన్నికల సమయంలో ఆ వర్గం బీజేపీకి దూరమైంది. దాంతో, బీజేపీ కనీస మెజారిటీతో గట్టెక్కింది. దాంతో, కనువిప్పైన బీజేపీ పటీదార్ నాయకుడైన భూపేంద్ర పటేల్ ను సీఎం చేసింది. ఆయననే సీఎంగా కొనసాగిస్తామని ఈ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రకటించింది. తాజాగా, కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఆయనను ఎన్నుకున్నారు.

Rivaba Jadeja to be Gujarat minister: మంత్రులు ఎవరు?

భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో కనీసం 12 మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులు సహా 28 మంది వరకు మంత్రులుగా చేరనున్నారని సమాచారం. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు. ఆమెతో పాటు పటీదార్ రిజర్వేషన్ల పోరాటంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్ లకు కూడా మంత్రి పదవి దక్కనుంది. శంకర్ చౌదరి, డాక్టర్ దర్శన్ షా, అమిత్ ఠక్కర్ లు కూడా మంత్రులు కానున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గంతో సహా గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్త మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమ ప్రాతినిధ్యం వహించేలా, సామాజిక సమతౌల్యం పాటిస్తామని బీజేపీ ప్రకటించింది.

Oath taking on 12th Dec: 12న ప్రమాణం

సోమవారం, డిసెంబర్ 12న భూపేంద్ర మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 12 మంది వరకు మంత్రులుగా ప్రమాణం చేయవచ్చని సమాచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు. గాంధీ నగర్ లోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ నూతన ఎమ్మెల్యేల సమావేశానికి పార్టీ అధిష్టానం తరఫన పరిశీలకులుగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్నాటక మాజీ సీఎం యెడియూరప్ప, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు. ఢిల్లీలోని అగ్ర నేతలను కలవడానికి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఢిల్లీకి పయనమయ్యారు.

1985 Congress record: 1985 తరువాత..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 182 స్థానాలకు గానూ 156 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. గతంలో రాష్ట్రంలో ఈ రికార్డు కాంగ్రెస్ పేరిట ఉంది. 1985లో మాధవ్ సింగ్ సోలంకీ నేతృత్వంలో కాంగ్రెస్ 149 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల్లో ఘన విజయం అనంతరం బీజేపీ నేత, కాబోయే సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ఉమ్మడి పౌర స్మృతి సహా అన్ని ఎన్నికల హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.