Gujarat Assembly Results 2022 : గుజరాత్‌లో వార్ ఎందుకు వన్ సైడ్ అయింది..?
Gujarat Result : గుజరాత్‌లో కమలం పార్టీ దుమ్మురేపింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు బ్రేక్ చేసింది. ఎప్పుడూ లేని విధంగా ఇన్ని స్థానాలు గెలవడానికి కారణాలు ఏంటి? మోదీ మేనియా పని చేసిందా?
గుజరాత్(Gujarat)లో బీజేపీ చరిత్ర సృష్టించింది. వరుసగా ఏడోసారి విజయం సాధించింది. రికార్డును బద్దలు కొట్టింది. మెుత్తం ఇక్కడ 182 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 156 స్థానాల్లో కమలం వికసించి.. సరికొత్త చరిత్ర లిఖించింది. ఈసారి గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. 2002లో 127 స్థానాలను గెలుచుకున్న కమలం.. 20 ఏళ్ల తర్వా ఆ రికార్డును బ్రేక్ చేసింది.
30 ఏళ్లుగా ప్రతిక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) కేవలం 17 సీట్లకే పరిమితమైంది. ఇంత పెద్ద విజయం సాధించేందుకు బీజేపీకి(BJP) ఉపయోగపడిన కారణాలేంటి? మోదీ మేనియా పని చేసిందా? హస్తం పార్టీ ఎన్నికల్లో సరిగా దూకుడు చూపించలేదా?
ఆప్(AAP), ఎంఐఎం పార్టీల ప్రభావం బీజేపీ మీద కంటే.. కాంగ్రెస్ పార్టీ మీదే ఎక్కువ చూపించాయి. అంతేకాదు.. హస్తం అధిష్టానం పెద్దగా ఈ ఎన్నికలపై ఫోకస్ చేయలేదని విమర్శ కూడా ఉంది. ఇక్కడ ఎన్నికల్లో మోదీ(Modi) మేనియా ఎక్కువగా పనిచేసింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి.. కమలం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి అగ్రనేతల సొంత రాష్ట్రం కావడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఇక బీజేపీ వ్యూహాలు పక్కా ఉంటాయి. అవి సరిగా పని చేశాయి. నిజానికి కేజ్రీవాల్ ఎంటర్ అయ్యాక.. త్రిముఖ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. బీజేపీ(BJP) కూడా ఇదే విషయంపై కాస్త ఆలోచనలో పడింది. అయితే అది ప్రచారం వరకే ఉంది.. ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. కేజ్రీవాల్ గుజరాత్(Gujarat)లో హిందుత్వ భావనపై కూడా ప్రచారం చేశారు. కానీ గుజరాతీలు కేజ్రీవాల్ ను తమ నేతగా స్వీకరించేలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా కాంగ్రెస్ ఓట్లు చీలాయి. ఇది బీజేపీకి ప్లస్ అయింది.
బీజేపీ అగ్రనాయకుల సభలు ... గుజరాత్ లో పెట్టడం కూడా కలిసొచ్చింది. బలమైన అభ్యర్థులను బీజేపీ నిలబెట్టింది. అంతేకాదు.. కాంగ్రెస్ నుంచి వచ్చిన 17 మందికి కూడా టికెట్ ఇచ్చింది. కొంతమంది కమలం నేతలు అలకబూని రెబల్స్ గా మారారు. కానీ రంగంలోకి దిగిన అమిత్ షా వారిని బుజ్జగించి.. పదవులు ఇస్తాననే వాగ్దానాలు చేశారు. దీంతో వారు కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. హిందుత్వ వాదాన్ని కూడా బీజేపీ బలంగా తీసుకెళ్లింది.
మోదీ, అమిత్ షా మేనియా గుజరాత్ లో బాగా పని చేసింది. చాలా స్థానాల్లో గెలిచేందుకు ఇది ఉపయోగపడింది. మోదీ(Modi) కూడా ఈసారి ఎన్నికల కోసం తీవ్రంగానే శ్రమించారు. బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడారు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కాస్త వ్యతిరేకత ఉన్నా.. కేంద్రం నుంచి వచ్చే నిధులు, మోదీ, అమిత్ షా పర్యటనలు బీజేపీకి కలిసొచ్చాయి.
పంజాబ్ లో గద్దెనెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ పైనా కన్నేసింది. ఈ విషయం కాషాయం పార్టీని కాస్త కలవరపెట్టింది. 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నలతో బరిలోగి దిగింది. ఈ విషయాన్ని మోదీ-షా ముందుగానే గ్రహించారు. పార్టీపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఫలితంగా సూపర్ విక్టరీ సాధించారు.
సంబంధిత కథనం