Bengaluru water crisis : నీటి సంక్షోభంతో బెంగళూరును వదిలేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు..!
Bengaluru water crisis latest news : బెంగళూరు నీటి సంక్షోభం నేపథ్యంలో.. ఐటీ ఉద్యోగులు నగరాన్ని వదిలి వెళిపోతున్నట్టు తెలుస్తోంది! ఇంకొందరు వర్క్ ఫ్రం హోం కావాలని సీఎంనే అభ్యర్థిస్తున్నారు!
Bengaluru water shortage : బెంగళూరు నీటి సంక్షోభం.. రోజురోజుకు పెరిగిపోతోంది! వేసవి కాలంలో నీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటన్నింటి మధ్య సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరును టెక్ ఉద్యోగులు వదిలేసి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. నీటి సంక్షోభంతో.. బెంగళూరులో జీవించడం చాలా కష్టంగా ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం..
పలు మీడియా కథనాల ప్రకారం.. కొందరు ఐటీ ఉద్యోగులు.. బెంగళూరును వదిలేసి తాత్కాలికంగా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇంకొందరు.. శాశ్వతంగా బెంగళూరు నుంచి షిప్ట్ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నారు.
"భారీ భారీ రెంట్లు కడుతున్నాము. నెలకు రూ. 25వేలు కడుతున్నాము. కానీ మంచి నీటి కొరత చాలా ఉంది," అని అయ్యప్ప నగర్లో నివాసముంటున్న ఓ ఐటీ ఉద్యోగి మీడియాకు చెప్పాడు.
Bengaluru water crisis : బెంగళూరులో నీటి సంక్షోభానికి.. వేగంగా ఎండిపోతున్న బోర్‌వెల్స్ ఒక కారణం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పిన మాటల ప్రకారం.. నగరంలోని 13,900 బోర్‌వెల్స్‌లో 6,900 బోర్‌వెల్స్ పనిచేయడం లేదు.
ఇక మరో టెక్ ఉద్యోగిని అనిత.. బెంగళూరును శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదీ చూడండి:- Summer temperature : ఈసారి వేసవిలో.. భరించలేని విధంగా భానుడి 'భగభగలు'!
"మేము బోర్‌వెల్స్ మీదే ఆధారపడుతున్నాము. కానీ ఇప్పుడు నీటి సంక్షోభం ఏర్పడింది. వాటర్ ట్యాంకర్స్ కోసం గంటలు గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. నేను బెంగళూరు నుంచి శాశ్వతంగా షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాను. ముంబైకి వెళతాను," అని అనిత చెప్పుకొచ్చారు.
మరో ఐటీ ఎంప్లాయీ రష్మి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు!
Bengaluru water shortage reason : "నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. ట్యాంకర్స్ కోసం ఎదురుచూస్తుంటే.. కమ్యూనిటీలో నీటి పంపకం మీద గొడవలు జరుగుతున్నాయి. 15ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నాము. గతంలో ఇలా ఒక్కసారి కూడా జరగలేదు," అని రష్మి తెలిపారు.
అయితే.. చాలా వరకు కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం ఆప్షన్ని ఎత్తివేయడంతో ఉద్యోగుల పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. ఇదే విషయంపై సీఎం సిద్ధరామయ్యకు అనేక విజ్ఞప్తులు అందుతున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించే విధంగా.. ఐటీ కంపెనీలకు ఆదేశాలివ్వాలని చాలా మంది ఆయన్ని కోరుతున్నారు.
Bengaluru latest news : కర్ణాటకలో గతేడాది సరిగ్గా వర్షాలు పడలేదు. ఫలితంగా.. గత కొన్నేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా.. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు బెంగళూరు ప్రజలు.
సంబంధిత కథనం