BEL Recruitment 2023: ప్రొబేషనరీ ఇంజనీర్, పలు ఇతర పోస్టుల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 232 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 28, 2023. కాగా, ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.
ప్రొబేషనరీ ఇంజనీర్ మరియు ప్రొబేషనరీ ఆఫీసర్ (HR) పోస్టులకు అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు కాగా, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ లకు 30 సంవత్సరాలు.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. పూర్తి వివరాల కోసం బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ను పరిశీలించండి.
టాపిక్