Xi Jinping profile: ‘‘చైనా, కమ్యూనిస్ట్ పార్టీ.. జిన్ పింగ్ రెండు కళ్లు..’’-at 15 xi was sent to countryside he slept in cave homes for years
Telugu News  /  National International  /  At 15, Xi Was Sent To Countryside. He Slept In Cave Homes For Years
చైనా దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్
చైనా దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్

Xi Jinping profile: ‘‘చైనా, కమ్యూనిస్ట్ పార్టీ.. జిన్ పింగ్ రెండు కళ్లు..’’

10 March 2023, 15:50 ISTHT Telugu Desk
10 March 2023, 15:50 IST

Xi Jinping profile: చైనా లో తిరుగులేని నిరంకుశ నేతగా ఎదిగిన దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొని, ఈ స్థాయికి ఆయన ఎదిగారు.

Xi Jinping profile: చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పదవీకాలం జీ జిన్ పింగ్ (Xi Jinping) కు లభించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (china communist party CPC) లో ఎదురులేని నేతగా ఆయన ఎదిగిన క్రమం ఒక స్ఫూర్తిదాయక చరిత్రం. బాల్యంలో రాజరిక సౌకర్యాలను అనుభవించాడు. ఆ తరువాత అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో గడిపాడు. కొండ గుహల్లో నిద్రించాడు.

Xi Jinping father history: తండ్రి వారసత్వం..

షీ జిన్ పింగ్ (Xi Jinping) తండ్రి షీ ఝాంగ్జున్ (Xi Zhongxun) చైనా విప్లవ చరిత్రలో కీలక నాయకుడు. కమ్యూనిస్ట్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. Xi Zhongxun ఉప ప్రధాని బాధ్యతలను కూడా నిర్వర్తించారు. కమ్యూనిస్ట్ పార్టీ (china communist party CPC) సిద్ధాంతాల కఠినత్వాన్ని కుటుంబం పట్ల కూడా పాటించేవాడు. కుటుంబ సభ్యులు కచ్చితంగా క్రమశిక్షణ పాటించేలా చూసేవాడు. ‘‘చూసేవారికి ఆయన తీరు దారుణంగా, అమానవీయంగా కనిపించేది’’ అని ఆయన జీవిత చరిత్ర రాసిన జోసెఫ్ వ్యాఖ్యానించారు.

Dispute with Mao: మావోతో విబేధాలు..

అయితే, అప్పుడు చైనా (china) లో తిరుగులేని నేతగా ఉన్న మావో (Mao) తో విబేధాలు జిన్ పింగ్ తండ్రి షీ ఝాంగ్జున్ (Xi Zhongxun) పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఒక్కసారిగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పాతాళానికి పడిపోయారు. సాంస్కృతిక విప్లవం (Cultural Revolution) సమయంలో జిన్ పింగ్ కుటుంబ సభ్యులు దారుణమైన వేధింపులను ఎదుర్కొన్నారు. మొత్తం కుటుంబం కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపింది. జిన్ పింగ్ (Xi Jinping) స్వయంగా స్కూల్ లో వేధింపులను ఎదుర్కొన్నాడు. పాఠశాలలో జిన్ పింగ్ (Xi Jinping) ను సామాజికంగా బహిష్కరించారు. ఇవన్నీ నిజానికి జిన్ పింగ్ లో పిరికితనానికి బదులు ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కొనే సాహసాన్ని ఇచ్చాయి.

At 5 years age: 15 ఏళ్ల వయస్సులో..

15 ఏళ్ల వయస్సులో జిన్ పింగ్ (Xi Jinping) ను ఇల్లు విడిచి వెళ్లమని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, గ్రామీణ జీవనాన్ని గమనిస్తూ, అక్కడే గడపాలని ఆదేశించారు. దాంతో ఆ చిన్న వయస్సులోనే జిన్ పింగ్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అడవుల్లో గడిపాడు. కొండ గుహల్లో నిద్ర పోయాడు. ఇవన్నీ ఆయనను మరింత రాటు దేల్చాయి. నాడు జిన్ పింగ్ నిద్రించిన ఒక కొండ గుహ ఇప్పుడు ఒక పెద్ద పర్యాటక ప్రదేశంగా మారింది.

Xi Jinping profile: అధికారంపై ఆశ కాదు..

జిన్ పింగ్ (Xi Jinping) పై విదేశీ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. జిన్ పింగ్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నారని, జిన్ పింగ్ (Xi Jinping) కు అధికారం కోసం ఏమైనా చేస్తారని, వ్యతిరేకులను అంతమొందిస్తారని.. ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. అయితే, అవన్నీ నిజాలు కావని జిన్ పింగ్ సన్నిహితులు చెప్తారు. ‘‘చైనా (china)ను ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మార్చాలన్నది జిన్ పింగ్ స్వప్నం. ఆ స్వప్నం సాకారం కావాలంటే అధికారంలో ఉండడమొక్కటే మార్గమని ఆయన విశ్వసించారు. కమ్యూనిస్ట్ పార్టీ జిన్ పింగ్ కు దైవంతో సమానం. ఆయనకు వేరే వ్యక్తిగత జీవితం లేదు. పార్టీని, చైనాను బలోపేతం చేయడమే లక్ష్యంగా జీవిస్తున్నారు’’ అని జిన్ పింగ్ జీవితంపై ఒక పుస్తకం రాసిన అల్ఫ్రెడ్ చాన్ వివరించారు. ప్రపపంచంలోనే చైనా (china) అత్యంత శక్తివంతమైన దేశం కావాలన్నది జిన్ పింగ్ (Xi Jinping) కల అని వివరించారు.

టాపిక్