Indian student dead in US : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. అదృశ్యమైన నెల రోజులకు..-another missing indian student found dead in ohio us ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Student Dead In Us : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. అదృశ్యమైన నెల రోజులకు..

Indian student dead in US : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. అదృశ్యమైన నెల రోజులకు..

Sharath Chitturi HT Telugu
Apr 09, 2024 12:10 PM IST

Indian student dead in Ohio : అమెరికాకు వెళ్లిన హైదరాబాద్​వాసి అబ్దుల్​ అర్ఫత్​ మృతదేహం పోలీసులకు దొరికింది. దాదాపు నెల రోజుల క్రితం అతను అదృశ్యమయ్యాడు.

మహమ్మద్​ అబ్దుల్​ అర్ఫత్​
మహమ్మద్​ అబ్దుల్​ అర్ఫత్​ (Indian Tech Guide)

Indian student found dead in America : అమెరికాలో భారత విద్యార్థుల మరణ వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాగాజా.. హైదరాబాద్​కు చెందిన మహమ్మద్​ అబ్దుల్​ అర్ఫత్​ మృతిచెందాడు. అదృశ్యమైన దాదాపు నెల రోజులకు.. అతని మృతదేహం పోలీసులకు లభించింది.

అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి..

హైదరాబాద్​కు చెందిన 25ఏళ్ల అర్ఫత్​.. 2023లో అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్​ చేసేందుకు ఒహాయోలోని క్లీవ్​ల్యాండ్​ స్టేట్​ యూనివర్సిటీలో చేరాడు. కాగా.. కొన్ని వారాల క్రితం అబ్దుల్​ అర్ఫత్​ అదృశ్యమయ్యాడు.

"అర్ఫత్​తో చివరిగా.. మార్చ్​ 7న మాతో మాట్లాడాము. ఆ తర్వాత నుంచి ఫోన్​ స్విచాఫ్​ వచ్చింది. మార్చ్​ 19న.. మాకు ఓ ఫోన్​ వచ్చింది. డ్రగ్స్​ విక్రయించే గ్యాంగ్​.. అర్ఫత్​ని కిడ్నాప్​ చేసిందని, 1200 డాలర్లు ఇస్తే విడిచిపెడతామని ఫోన్​లో మాట్లాడిన వ్యక్తి చెప్పాడు," అని అమెరికాలో మరణించిన భారత విద్యార్థి తండ్రి మహమ్మద్​ సలీమ్​ పేర్కొన్నారు.

"నా బిడ్డతో మాట్లాడాలని అని అడిగితే అతను ఒప్పుకోలేదు. ఏ మార్గంలో డబ్బులు పంపాలో చెప్పమంటే.. చెప్పలేదు," అని సలీమ్​ తెలిపారు.

Mohammed Abdul Arfath dead in America : ఈ విషయంపై భారత కాన్సులేట్​ స్పందించింది. అదృశ్యమైన అబ్దుల్​ అర్ఫత్​ కోసం అణ్వేషిస్తున్నట్టు, పోలీసు అధికారులతో టచ్​లో ఉన్నట్టు పేర్కొంది. కాని చాలా రోజుల పాటు అర్ఫత్​ జాడ తెలియరాలేదు.

మహమ్మద్​ అర్ఫత్​ మృతదేహం లభించినట్టు ఏప్రిల్​ 9న ఉదయం.. కాన్సులేట్​ ఓ ట్వీట్​ చేసింది.

"అదృశ్యమైన మహమ్మద్​ అబ్దుల్​ అర్ఫత్​ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలో.. అతని మృతదేహం లభించింది. చాలా బాధాకరం. ఒహాయోలోని క్లీవ్​ల్యాండ్​లో అతని మృతదేహం కనిపించింది. మహమ్మద్​ అర్ఫత్​ కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి," అని న్యూయార్క్​లోని ఇండియన్​ కాన్సులేట్​ ట్వీట్​ ద్వారా తెలిపింది.

అమెరికాలో రాలిపోతున్న ప్రాణాలు..

Indian student dead in Ohio : ఉన్నత చదువుల కోసం చాలా మంది భారతీయులు ఎంచుకుంటున్న దేశం అమెరికా. ఆ దేశ డేటా ప్రకారం.. 2022-23 సీజన్​లో.. 2.6లక్షల మంది భారతీయ విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్లారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే. ఇది 35శాతం అధికం!

కోటి ఆశలతో అమెరికా వెళుతున్న భారతీయుల్లో చాలా మంది ఇటీవలి కాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా.. అటు విద్యార్థులు, ఇటు కుటుంబసభ్యుల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి.

ఇటీవలే.. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందిన వార్త బయటకు వచ్చింది. అతను ఎలా మరణించాడో తెలియరాలేదు. కాగా.. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని న్యూయార్క్​లోని భారత కాన్సులేట్ ఓ ప్రకటనలో తెలిపింది. అతని పేరు ఉమా సత్యసాయి గద్దె అని పేర్కొంది.

Indian student dead in US : 'ఒహాయోలోని క్లీవ్​ల్యాండ్​లో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించడం చాలా బాధాకరం,' అని న్యూయార్క్​లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక పోస్ట్​ ద్వారా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం