Indonesia football stadium stampede : ఇండోనేషియా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రక్తపాతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఇప్పటికే 174మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హింసాకాండ.. కొత్త విషయమేమీ కాదు! 40ఏళ్లుగా ఇలాంటి దృశ్యాలకు ప్రపంచం సాక్ష్యంగా నిలుస్తూనే ఉంది.
2022 జనవరి, కామెరూన్:- కామెరూన్ ప్రాంతంలోని యోండె ఒలెంబె స్టేడియంలో జరిగిన హింసాకాండలో 8మంది మరణించారు. 38మంది తీవ్రంగా గాయపడ్డారు.
Major football stadium disasters Timeline : 2012 ఫిబ్రవరి, ఈజిప్ట్:- అల్ మశ్రి, అల్ అహ్లెయ్ జట్ల మధ్య పోర్ట్ సిటీలో మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో 73మంది మరణించారు. 1000మంది గాయపడ్డారు. ఈజిప్టియన్ లీగ్.. రెండేళ్ల పాటు సస్పెండ్ అయ్యింది.
2009 మార్చ్, ఐవరీ కోస్ట్:- అబిడ్జన్ ఫెలిక్స్ హోఫౌట్ స్టేడియంలో.. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌కి ముందు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19మంది మరణించారు.
Major football stadium disasters : 2001 మే, ఘానా:- అక్రే మెయిన్ ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. అభిమానులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో 120మంది మరణించారు. ఆఫ్రికాలోని అతిపెద్ద ఫుట్‌బాల్ మ్యాచ్ హింసాకాండ ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది.
2001 ఏప్రిల్, సౌత్ ఆఫ్రికా:- జోహెన్నెస్‌బర్గ్‌లోని ఎల్లిస్ పార్క్ స్టేడియంలో.. సౌత్ ఆఫ్రికా లీగ్ మ్యాచ్ జరుగుతున్న సమయం అది. అభిమానులు.. స్టేడియం లోపలికి చొచ్చుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 43మంది మరణించారు.
Indonesia football stadium stampede death toll : 1996 అక్టోబర్, గౌటెమల:- గౌటెమల, కోస్టా రీకాల మధ్య గౌటెమల నగరంలో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. అభిమానులు సృష్టించిన అలజడిలో 80మందికిపైగా ప్రజలు మరణించారు.
1992 మే, ఫ్రాన్స్:- బస్టియా ఫురైని స్టేడియంలో ఫ్రెంచ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఒక్కడే ఉన్న ఓ స్టాండ్.. ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 18మంది మరణించారు. 2300మంది గాయపడ్డారు.
1991 జనవరి, సౌత్ ఆఫ్రికా:- ఒప్పెన్‌హైమర్ స్టేడియంలో కైజర్ ఛీఫ్స్, ఒర్లాండో పైరేట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పైరేట్స్ ఫ్యాన్ ఒకడు.. ఛీఫ్స్ మద్దతురాలుపై కత్తితో దాడి చేశాడు. అనంతరం జరిగిన తొక్కిసలాట ఘటనలో 42మంది మరణించారు.
1989 ఏప్రిల్, ఇంగ్లాండ్:- హిల్స్బోరఫ్ స్టేడియంలో ఎఫ్ఏ కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. లివర్‌పూల్, నాటింగ్హమ్ ఫారెస్ట్ జట్లు తలపడ్డాయి. స్టేడియం సామర్థ్యానికి మంచిన అభిమానలు తరలివెళ్లారు. ఈ తొక్కిసలాటలో 96మంది లివర్‌పూల్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ వ్యక్తి.. 32ఏళ్ల పాటు ప్రాణాలతో పోరాడి ఈ ఏడాది జూన్‌లో మరణించాడు.
Indonesia football stadium stampede news : 1988 మార్చ్, నేపాల్:- ఖాట్మండూలోని నేపాల్ ఫుట్‌బాల్ స్టేడియంలో ఓ మ్యాచ్ జరిగింది. అనూహ్యంగా తుపాను ప్రతాపం చూపించింది. అభిమానులు పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో 90మంది మృతిచెందారు.
1985 మే, బెల్జియం:- బ్రసెల్స్‌లోని హెయ్సెల్ స్టేడియంలో యూరోపియన్ కప్ పైనల్ మ్యాచ్ జరిగింది. జువెన్టస్, లివర్‌పూల్ జట్లు తలపడ్డాయి. ఫ్యాన్ వార్‌లో 39మంది ప్రాణాలు కోల్పోయారు. 600మంది గాయపడ్డారు.
1985 మే, ఇంగ్లాండ్:- బ్రాండ్ఫోర్డ్లోని పరేడ్ స్టేడియంలో థర్డ్ డివిజన్ మ్యాచ్ జరుగుతున్న వేళ.. అక్కడి స్టాండ్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తొక్కిసలాటలో 56మంది మరణించారు. 200మంది గాయపడ్డారు.
Major football match tragedies : 1982 అక్టోబర్, రష్యా:- యూఫా కప్‌లో భాగంగా మాస్కోలోని ఓ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఎన్నో ఏళ్ల పాటు ఈ విషయంపై గోప్యత వహించింది సోవియట్ ప్రభుత్వం. చివరిగా.. ఘటనపై స్పందించి.. 66మంది మరణించినట్టు వెల్లడించింది. ఘటనకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు!
సంబంధిత కథనం